ఇప్పటి వరకు రష్యా సుమారు 800మిస్సైళ్లను తమపై ప్రయోగించినట్లు తెలిపింది ఉక్రెయిన్. ఫిబ్రవరి 24వ తేదీనుంచి ఇప్పటివరకు వదిలిన మిస్సైళ్లలో క్రూయిజ్, బాలిస్టిక్ మిస్సైళ్లు ఉన్నాయి. ఉక్రెయిన్ సైనిక అధికారులు ఈ విషయాన్ని తెలిపారు. ఎక్కువ శాతం మిస్సైళ్లు దక్షిణ, తూర్పు ప్రాంతాలను టార్గెట్ చేసినట్లు ఉక్రెయిన్ జనరల్ చెప్పారు. సమాజపరంగా కీలకమైన మౌళిక క్షేత్రాలపైన కూడా రష్యా మిస్సైళ్ల వర్షం కురిపించినట్లు ఉక్రెయిన్ తెలిపింది. బుధవారం కూడా ఉక్రెయిన్‌లోని అనేక ప్రాంతాల్లో ఫైటింగ్ జరిగింది. ఖార్కివ్‌లో రష్యా సేనలను ఉక్రెయిన్ దళాలు తరిమికొడుతున్నట్లు తెలుస్తోంది. మరియపోల్‌లో రష్యా బలగాలు ఆర్టిల్లరీ, ఎయిర్‌స్ట్రయిక్స్‌కు పాల్పడుతున్నట్లు ఉక్రెయిన్ జనరల్ స్టాఫ్ తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement