భారత్‌లో దాడులు చేపట్టేందుకు ప్రణాళికలు రచిస్తోన్న ఈ క్రమంలో ఓ కీలక ఉగ్రవాదిని రష్యా బలగాలు పట్టుకున్నాయి. ఆత్మాహుతి దాడికి పాల్పడే ఉద్దేశంతో భారత్‌కు వెళ్లేందుకు ప్రయత్నించిన ఐఎస్‌ఐఎస్ టెర్రరిస్టును పట్టుకున్నట్లు రష్యాకు చెందిన ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్(ఎఫ్‌ఎస్‌బీ) ప్రకటించింది. భారత ప్రభుత్వంలోని కీలక నేతపై దాడి చేసేందుకు ఉగ్రవాది పతకం రచించినట్లు పేర్కొంది. రష్యాలో నిషేధించిన ఇస్లామిక్ స్టేట్ టెర్రరిస్టును రష్యన్ ఫెడరేషన్‌కు చెందిన ఎఫ్‌ఎస్‌బీ గుర్తించి అదుపులోకి తీసుకుంది.
సెంట్రల్ ఆసియా ప్రాంతంలోని ఓ దేశానికి చెందిన వ్యక్తిగా గుర్తించింది. ఆ ఉగ్రవాది భారత్‌లోని ప‍్రభుత్వానికి చెందిన ఓ కీలక నేత లక్ష్యంగా ఆత్మాహుతి దాడి చేసే ప్రణాళికతో అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించాడని రష్యా అధికారులు పేర్కొన‍్నారు. సూసైడ్ బాంబర్‌ను ఐఎస్‌ఐఎస్ టర్కీలో తమ సంస్థలో చేర్చుకున్నట్లు ఎఫ్‌ఎస్‌బీ పేర్కొంది. అయితే ఉగ్రవాది రష్యా మీదుగా ఇండియాకు వెళ్తే అనుమానం రాదనే ఉద్దేశంతో డాక్యుమెంట్లు సిద్ధం చేసుకున్న తరుణంలో రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ అధికారులు ఈ కుట్రను భగ్నం చేశారు.