ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం చేస్తోంది. అయితే రష్యా ఫస్ట్ టార్గెట్ తానే అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ అన్నారు. రెండో టార్గెట్ తన కుటుంబం అన్నారు. కివీ నగరాన్ని రష్యన్ దళాలు తమ ఆధీనంలోకి తీసుకొన్నాయని ప్రకటించారు. తాను కీవ్ నగరంలోనే ఉంటానని వెల్లడించారు. ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని పడగొట్టడమే లక్ష్యంగా రష్యా ఆర్మీ దాడి చేస్తోందని ఉక్రెయిన్ అధికారులు చెప్పారు. కీవ్ నగరానికి ఉత్తరాన ఉన్న చెర్నోబిల్ అణు విద్యుత్ ప్లాంట్ ను రష్యా దళాలు స్వాధీనం చేసుకొన్నాయి. బెలారస్ నుండి ఉక్రెయిన్ లోకి రష్యా దళాలు ప్రవేశించాయి. రష్యా తనను నెంబర్ వన్ లక్ష్యంగా పెట్టుకొందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ప్రకటించారు. తన తర్వాత తన కుటుంబాన్ని నాశనం చేయడం రష్యా లక్ష్యంగా ఆయన పేర్కొన్నారు. ఉక్రెయిన్ ను రాజకీయంగా నాశనం చేయాలని అనుకొంటున్నారని జెలెన్ స్కీ చెప్పారు.తాను రాజధానిలోనే ఉంటాను, తన కుటుంబం కూడా ఉక్రెయిన్‌లోనే ఉందని జెలెన్ స్కీ వివరించారు. రష్యా ప్రజలను కాపాడేందుకే ఉక్రెయిన్ పై మిలటరీ ఆపరేషన్ ప్రారంభించినట్టుగా పుతిన్ ప్రకటించారు. రష్యా దళాలతో తమ దేశ సైన్యం భీకరంగా పోరాటం చేస్తుందని జెలెన్ స్కీ చెప్పారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..