Saturday, November 23, 2024

Big Breaking: ఉక్రెయిన్​పై యుద్ధం ప్రకటించిన రష్యా

ఉక్రెయిన్​పై యుద్ధం ప్రకటింఉక్రెయిన్​పై రష్యా యుద్ధం ప్రకటించింది. ఉక్రెయిన్​లో ‘సైనిక ఆపరేషన్’ చేపట్టనున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. పౌరులను కాపాడేందుకే ఈ చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ప్రజలను ఉద్దేశించి టెలివిజన్​ ద్వారా ప్రసంగించిన పుతిన్.. ఉక్రెయిన్ నుంచి ఎదురవుతున్న ముప్పుకు స్పందనగానే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఉక్రెయిన్​ను ఆక్రమించుకోవాలని తమకు ఎలాంటి లక్ష్యం లేదని పుతిన్ స్పష్టం చేశారు. రక్తపాతానికి ఉక్రెయిన్ పాలకులదే బాధ్యత అని చెప్పారు.

మరోవైపు ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించిన ఉక్రెయిన్ ప్రభుత్వం.. ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొవాలో ఆలోచన చేస్తోంది. రష్యా ప్రకటనతో ప్రపంచ దేశాలు ఆందోళనకు గురవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement