కరోనా వైరస్‌లో వేరియంట్లకు అడ్డుకట్ట పడడం లేదు. మాయదారి వైరస్ రోజుకో రకంగా రూపాంతరం చెందుతూ ప్రజలను పీడిస్తోంది. తాజాగా రష్యాలోని మాస్కోలో మరో కొత్త వేరియంట్ వెలుగుచూసింది. ఇది మాస్కోలో బయటపడడంతో దీనిని మాస్కో వేరియంట్‌గా పిలుస్తున్నారు. ఈ మేరకు రష్యాలోని గమలేయా నేషనల్ సెంటర్ శాస్త్రవేత్తలు తెలిపారు. దేశంలో కేసులు ఎక్కువగా వెలుగు చూస్తున్న నేపథ్యంలో పరీక్షలు నిర్వహించగా ఈ రకం బయటపడింది. ఆ దేశం అభివృద్ధి చేసిన స్పుత్నిక్ టీకా ‘మాస్కో వేరియంట్’పై ఎంత మేరకు ప్రభావం చూపిస్తుందన్న దానిపై పరిశోధనలు నిర్వహిస్తున్నట్టు ‘గమలేయ’ హెడ్ అలెగ్జాండర్ గింట్స్‌బర్గ్ తెలిపారు. ఈ కొత్త స్ట్రెయిన్‌పై వ్యాక్సిన్ పనిచేస్తుందనే విశ్వసిస్తున్నట్టు చెప్పారు. కాగా, రష్యాలో నిన్న 13,397 కేసులు వెలుగుచూడగా, అందులో ఒక్క మాస్కోలోనే 5,782 కేసులు నమోదు కావడం గమనార్హం.
Advertisement
తాజా వార్తలు
Advertisement