రష్యా నుంచి ఎస్-400 క్షిపణి రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేయాలని భారత్ నిర్ణయించింది. ఆ మేరకు 2018లో రష్యాతో ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ఈ ఒప్పందం మేరకు ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ ఐదు యూనిట్లు భారత్‌కు రష్యా అందించనుంది. ఒప్పందం కుదుర్చుకున్నప్పటి నుంచి అమెరికా నుంచి హెచ్చరికలు వస్తూనే ఉన్నాయి. అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా… భారత్‌పై ఆంక్షలు పెట్టాల్సి ఉంటుందని హెచ్చరిక చేశారు. అయినా భారత్ రష్యాతో కుదర్చుకున్న ఒప్పందం మేరకే ముందుకు సాగుతోంది. తాజాగా బిడెన్ ప్రభుత్వం… భారత్‌పై ఆంక్షలు విధించే అంశం పరిశీలిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడి ప్రతినిధి, ఆంక్షల విధాన శాఖ సమన్వయకర్త జేమ్స్ ఓ బ్రియన్ పేర్కొన్నారు. సీఏఏటీఎస్ఏ (కౌంటరింగ్ అమెరికన్ల విరోధులను ఆంక్షల చట్టం) ద్వారా భారత్‌పై ఆంక్షలు విధించే అంశం పరిశీలిస్తున్నట్లు వివరించారు. ఇటీవల రష్యా నుంచి ఎస్-400 క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేసిన టర్కీపై అమెరికా ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అదే అస్త్రాన్ని భారత్‌పైనా విధించనుందని సూచనప్రాయంగా వెల్లడించారు.
భారత్‌కు ఆయుధాలు, మందుగుండు సామ్రగి సరఫరాలో రష్యా కీలక భాగస్వామి. చాలా విభిన్న పరిస్థితుల మధ్య.. వ్యూహాత్మక భిన్న భద్రతా భాగస్వామ్యం మధ్య ఆ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగుతున్నాయి. అయిఏఅమెరికాకు భారత్‌కు మిత్రదేశం. అలాంటి మిత్ర దేశంపై ఆంక్షలు విధించడం సాధ్యమేనా? ఇవేమీ బెదిరింపులు కాదు అని సెనేటర్ టాడ్ యంగ్ అభిప్రాయం వ్య్తక్తం చేశారు. ఇక్కడ రెండు పరిస్థితులను గుర్తించాల్సి ఉందని, నాటో సభ్య దేశంగా డిఫెన్స్ ప్రొక్యూర్‌మెంట్ సిస్టమ్ ఉల్లంఘన, ఇక భారత్‌ను మిత్ర దేశంగా భావన. ఈ నేపథ్యంలో భారత్‌పై ఆంక్షలు విధించడం అంత సునాయాసం కాదని, అంతర్జాతీయంగా ఒత్తిళ్లు పెరుగుతాయని టాడ్ యంగ్ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే భారత్‌కు ఓ హెచ్చరిక ఇచ్చే అవకాశముందని పేర్కొన్నారు.
భారత్ – రష్యా ప్రధానంగా రక్షణ రంగంలో వ్యూహాత్మక భాగస్వామ్య దేశాలు. భారత దేశం అనుసరిస్తున్న స్వతంత్ర విదేశాంగ విధానం, దాని రక్షణ కొనుగోళ్లు దాని జాతీయ భద్రత ద్వారా మార్గనిర్దేశం చేయబడుతుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కుండబద్దలు కొట్టినట్లు పలుమార్లు అగ్రరాజ్యానికి స్పష్టం చేసింది. అయినా తరుచూ ప్రజాస్వామ్య దేశంపై ఆంక్షలు విధించడానికి అమెరికా ప్రయత్నిస్తూనే ఉంది.
రష్యా నుంచి భారత్ కొనుగోలు చేస్తున్న ఎస్-400 క్షిపణి వ్యవస్థ అత్యంత ఆధునిక సాంకేతికతో కూడుకున్నది. ఎంతో సమర్థవంతమైనదిగా గుర్తింపు పొందింది. దీర్ఘ పరిధి ఉపరితలం నుండి గగనతలానికి ప్రయోగించే క్షిపణి రక్షణ వ్యవస్థగా ఖ్యాతి గడించింది. వీటిని భారత్ కొనుగోలు చేయడానికి ప్రధాన కారణం… చైనా నుంచి పొంచి ఉన్న ముప్పు. ఈ నేపథ్యంలోనే రష్యా అభివృద్ధి చేసిన ఎస్-400 క్షిపణి వ్యవస్థ ఐదు యూనిట్లు కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. సాధ్యమైనంత తర్వలోభారత్‌కు రష్యా అందించనుందని ఇటీవల ప్రధానమంత్రి నరేంద్రమోడీతో వర్చువల్ సమావేశంలో ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital