Saturday, November 23, 2024

స్పుత్నిక్ నుంచి సింగిల్ డోస్ వ్యాక్సిన్

రెండో దశలో కరోనా మహమ్మారి శరవేగంతో విస్తరిస్తున్న తరుణంలో రష్యా మరో వ్యాక్సిన్‌ తీసుకొచ్చినట్టు ప్రకటించింది. కరోనా నివారణకు సంబంధిం సింగిల్‌ డోస్‌ స్పుత్నిక్ వ్యాక్సిన్‌ను  ఆమోదించినట్టు వెల్లడించింది. స్పుత్నిక్  ఫ్యామిలీకే చెందిన ఈ సింగిల్-డోస్ ‘స్పుత్నిక్ లైట్’ విప్లవాత్మకమైందని, 80 శాతం సామర్థ్యంతో  పనిచేస్తుందని  రష్యా అధికారులు తెలిపారు. రెండు మోతాదుల వ్యాక్సిన్ల కంటే స్పుత్నిక్ లైట్ టీకా చాలా ప్రభావవంతమైందని  ప్రకటించారు.

రష్యా గమలేయ ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్ 79.4 శాతం ప్రభావవంతంగా ఉందని రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌ మెంట్ ఫండ్ (ఆర్‌డిఐఎఫ్) వెల్లడించింది.  స్పుత్నిక్ లైట్ మోతాదుకు 10 డాలర్ల కంటే తక్కువ ఖర్చు అవుతుందనీ పేర్కొంది. గ‌తేడాది డిసెంబ‌ర్ 5 నుంచి ఈ ఏడాది ఏప్రిల్ 15 వ‌ర‌కూ ఈ వ్యాక్సిన్ ట్ర‌య‌ల్స్ నిర్వ‌హించారు. ఇందులో 28 రోజుల డేటాను సేక‌రించి సామ‌ర్థ్యాన్ని అంచనా వేశారు.  ప్రపంచవ్యాప్తంగా టీకాల కొరత ఉన్న సమయంలో సింగిల్‌ డోసు వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడంతో.. ఎక్కువ మందికి వేగంగా వ్యాక్సిన్‌ అందించే అవకాశం ఏర్పడుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement