ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరిన కొన్ని నిమిషాల్లోనే విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దాంతో పైలట్లు అత్యవసర ల్యాండింగ్ కోసం ఎయిర్ పోర్ట్ అనుమతి కోరడంతో అనుమతి వచ్చింది.ఎయిర్‌పోర్టుకు తిరిగి వచ్చిన ఆ కార్గో విమానం రన్‌వేపై కొద్దిదూరం వెళ్లిన తర్వాత రెండు ముక్కలైంది. అందులోంచి పైలట్లు క్షేమంగా బయటపడడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. విమానంలో హైడ్రాలిక్ సమస్య తలెత్తిందని, అందుకే ఈ ఘటన చోటు చేసుకుందని ఎయిర్‌పోర్ట్ అధికారులు వివరించారు. ల్యాండింగ్ సమయంలో విమాన ప్రమాదం జరిగే అవకాశాలు ఉండడంతో ముందస్తు చర్యలకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు వివరించారు. జర్మన్ కు చెందిన డీచ్‌ఎల్ బోయింగ్ 757 కార్గో విమానం కోస్టారికాలోని సాన్ జోస్ ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరిన కొన్ని నిమిషాల్లోనే విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement