Tuesday, November 26, 2024

ర‌ష్మీకి పెళ్ళి అయిపోయిందా – వైర‌ల్ అవుతోన్న టాక్

స్టార్ యాంక‌ర్ ర‌ష్మీ గౌత‌మ్ పెళ్ళిపై ప‌లు రూమ‌ర్స్ వ‌స్తున్నాయి. అయితే ర‌ష్మీ సీక్రెట్ గా పెళ్ళి చేసుకుంద‌నే వార్త‌లు తెగ హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. రష్మీ గౌతమ్‌ – సుడిగాలి సుధీర్‌ లవ్‌ గా ఉన్నారని.. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని గతంలోనే వార్తలు వినిపించాయి. అయితే.. ఆన్‌ స్క్రీన్‌ మాత్రమే తాము లవర్స్‌, ఆఫ్‌ స్క్రీన్‌ లో తాము మంచి ఫ్రెండ్స్‌ మాత్రమే అని చెప్పుకొచ్చారు. అయినప్పటికీ వీరి పెళ్లి గురించి అప్పుడప్పుడు గాసిప్స్‌ వినిపిస్తూనే ఉంటాయి. అయితే.. తాజాగా రష్మీ ఓ వ్యక్తిని సీక్రెట్‌ గా పెళ్లి చేసుకుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అతను ఓ ప్రైవేట్‌ కంపెనీలో మేనేజర్‌ గా పని చేస్తున్నాడని.. లాక్‌ డౌన్‌ లో కుటుంబ సభ్యల సమక్షంలో వీరి వివాహం కూడా జరిగిందని టాక్‌ నడుస్తోంది. ప్రస్తుతం రష్మీ తన భర్తతో కలిసి.. హైదరాబాద్‌ లోనే నివాసం ఉంటుందని.. కూడా వార్తలు వినిపిస్తున్నాయి.మ‌రి ఈ వార్త‌ల‌పై ర‌ష్మీ ఎప్పుడు స్పందిస్తుందో తెలియాలి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement