బస్సులోనే ఆర్టీసీ కండక్టర్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబుబాబాద్ జిల్లా తొర్రూరులో ఇవ్వాల (ఆదివారం) జరిగింది. తొర్రురూ మండల కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో జరిగిన ఈ ఘటన ఆర్టీసీ ఉద్యోగుల్లో కలకలం రేపింది. తొర్రూరు మండలం కంఠాయపాలెం గ్రామానికి చెందిన మహేందర్రెడ్డి ఆదివారం ఉదయం డ్యూటీకి వచ్చాడు. సెక్యూరిటీ రిజిస్ట్రర్లో సంతకంపెట్టి డిపోలోకి వెళ్లాడు. అలా వెళ్లిన వ్యక్తి ఎంతసేపటికీ బయటికి రాకపోవడంతో సెక్యూరిటీ సిబ్బంది వెళ్లి పరీశిలించగా.. బస్సులో విగతజీవిగా కనిపించాడు.
ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో డిపో అధికారులు కండక్టర్ ఆత్మహత్య విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. మహేందర్రెడ్డి ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు. అనే విషయమ్మీద ఇంకా క్లారిటీ రాలేదు. వ్యక్తిగత కారణాలా? పని ఒత్తిడితోనే ఆత్మహత్య చేసుకున్నాడా అనే విషయమ్మీద పలువురు చర్చించుకుంటున్నారు. పోలీసులు కూడా ఇదే కోణంలో ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది.