Friday, November 22, 2024

తెలంగాణ‌లో ఆర్టీసీ ఛార్జీల‌తో పాటు విద్యుత్ ఛార్జీలు పెంపు..

మ‌రోసారి తెలంగాణ‌లో ఆర్టీసీ ఛార్జీలు పెర‌గ‌నున్నాయి. ఇప్ప‌టికే తెలంగాణలో ఒకసారి ఆర్టీసీ చార్జీలను పెంచారు. వేలకోట్ల రూపాయల నష్టాల్లో కూరుకుపోయిన ఆర్జీసీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ నిర్ణయానికి తెలంగాణ స‌ర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదిలా ఉంటే ముందు నుండే ఆర్టీసీ నష్టాల్లో ఉంది. అయితే కరోనా కాలంలో ఆర్టీసీ పై మరింత ప్రభావం పడింది. అంతే కాకుండా బ్యాంకుల నుంచి ఆర్టీసీ తీసుకున్న అప్పుల భారం మోయలేక పోతోంది. ఈ నేపథ్యంలో మరోసారి చార్జీలను పెంచేందుకు నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉండగా ఆర్టీసీ ఛార్జీలతో పాటు తెలంగాణ లో విద్యుత్ ఛార్జీలను పెంచాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విద్యుత్ చార్జీల పెంపుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలోనే పెరిగిన చార్జీలను అమలు చేసే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement