హైదరాబాద్ నగర ప్రయాణికులకు గుడ్ న్యూస్. ప్రయాణికుల సౌకర్యం కోసం ఇప్పటికే హైదరాబాద్ మెట్రో రైల్ సేవలు ఉదయం 6 గంటల నుంచే అందుబాటులోకి వచ్చాయి. తాజాగా ఆర్టీసీ అధికారులకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతిరోజు తెల్లవారుజాము 4 గంటల నుంచే ఆర్టీసీ బస్సులను అందుబాటులో ఉంచుతున్నట్టు ప్రకటించారు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లతో పాటుగా MGBS, JBS లలో కూడా తెల్లవారుజామున 4 గంటల నుంచే సిటీ బస్సులను అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. కరోనాకు ముందు ఉన్నట్టుగానే ఉదయం 4 గంటల నుంచే అన్ని బస్సులు అందుబాటులో ఉంటాయని తెలంగాణ ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు. కాగా, బస్సులు, రైళ్లలో వచ్చే ప్రయాణికులకు ఇది సౌకర్యవంతంగా ఉంటుంది.
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఉదయం 4 గంటల నుంచే సిటీ బస్సులు!
Advertisement
తాజా వార్తలు
Advertisement