Saturday, November 23, 2024

గురుకులాలకు నిధులు లేవు.. దళిత బంధుకు కోట్లా?: మాజీ ఐపీఎస్ విమర్శలు

మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ పై కరీంనగర్ లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. దీనిపై ఆయన స్పందించారు. కేసులతో తనను భయపెట్టలేరని,బడుగు బలహీనవర్గాల గొంతుక అయ్యేందుకే తాను ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేశానని ఆర్ఎస్ ప్రవీణ్‌ కుమార్ స్పష్టం చేశారు. దేశంలో ఎస్సీ, ఎస్టీలు అణచివేతకు గురవుతున్నారని అన్నారు. సంగారెడ్డి జిల్లాలో పర్యటించిన ఆయన.. స్పేరోస్ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను పూలే, అంబేడ్కర్, కాన్సీరం బాటలోనే పోరాటం చేస్తానని తెలిపారు. ఉద్యోగానికి రాజీనామా చేసిన వెంటనే తనపై కేసులు నమోదె చేయడం దారుణమన్నారు. లక్ష్యం కోసం తాను చావడానికైనా సిద్ధమని స్పష్టం చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో సగం గురుకులాలకు భవనాలు లేవవని, నిధులు విడుదల కావడం లేదని ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. హజూరాబాద్​లో దళిత బంధు పేరిట ఖర్చు చేస్తున్న నిధులతో ఎంతోమంది చిన్నారులను గొప్పవ్యక్తులుగా తీర్చిదిద్దవచ్చని చెప్పారు. తెలంగాణలో గురుకులాలకు నిధులు లేక అక్రమాలు జరుగుతున్నా ప్రశ్నించే ఎమ్మెల్యే కరవయ్యాడని వ్యాఖ్యానించారు. ఒక ప్రవీణ్ కుమార్ మీద కేసు పెడితే… దేశంలో కోట్ల మంది ప్రవీణ్ కుమార్​లు పుట్టుకొస్తారని చెప్పారు.

కాగా, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ ఉద్యోగం నుంచి వాల్యుంటరీ రిటైర్మెంట్ తీసుకున్న మరుసటి ఆయనపై కరీంనగర్ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. హిందు దేవతలను ఆవమానించే రీతిలో విద్వేషపూరితంగా ప్రతిజ్ఞ చేశారంటూ.. న్యాయవాది బేతి మహేందర్ రెడ్డి కోర్టులో పిటిషన్ ధాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కరీంనగర్ మున్సిఫ్ మేజిస్ట్రేట్ కేసు నమోదు చేయాలని ఆదేశించారు. దీంతో ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్‌పై 144/2021, సెక్షన్లు 153-ఏ, 295-ఏ, 298 r/w 34 ఐపీసీ కింద కేసు నమోదు చేశారు.

ఇది కూడా చదవండిః మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై కరీంనగర్ లో కేసు నమోదు

Advertisement

తాజా వార్తలు

Advertisement