Tuesday, November 26, 2024

ఏడేళ్లలో దళితులకు ఏం చేశారు ?: కేసీఆర్ పై నిప్పులు చెరిగిన ప్రవీణ్

హుజూరాబాద్‌ ఉపఎన్నికలో గెలవడానికి సీఎం కేసీఆర్ ప్రతీ ఇంటికి గొర్రెలు, బర్రెలు ఇచ్చి అందరినీ బకరాలను చేస్తున్నారని బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ విమర్శించారు. దళితుల కోసం చివరి రక్తపు బొట్టు వరకు పోరాడతానని చెప్పిన సీఎం కేసీఆర్‌.. ఏడేళ్ల పాలనలో వారి కోసం ఏం చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. శనివారం ఆదిలాబాద్‌లో ఏర్పాటు చేసిన ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఎక్కడ ఇచ్చారని ప్రశ్నించారు. ప్రభుత్వం చేపడుతున్న వైకుంఠ ధామాలు, రైతు వేదికలు, కలెక్టర్‌ కార్యాలయాలకు దళితుల భూమిని లాక్కున్నారని ఆరోపించారు. ఎంతో కష్టపడి సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వ డం లేదని విమర్శించారు. హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్‌, బీజేపీ కలిసి డ్రామాలు ఆడుతున్నాయన్నారు. దళితుల దెబ్బకు కేసీఆర్‌ జై భీం అంటున్నారని, రేవంత్‌ రెడ్డి దళితవాడల్లో బస చేస్తున్నారని, బండి సంజయ్‌ కాషాయ కండువా తీసి నీలి కండువా వేసుకుంటున్నారని ర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ఎద్దేవా చేశారు.

ఇది కూడా చదవండిః బ్లాక్ మెయిల్ పనులు మానుకోః రేవంత్ కు మల్లారెడ్డి కౌంటర్

Advertisement

తాజా వార్తలు

Advertisement