Friday, November 22, 2024

రూ. కోటికి పైగా విలువైన డ్ర‌గ్స్.. స్వాధీనం చేసుకున్న ఎన్ సీబీ అధికారులు

కోటిరూపాయ‌లకి పైగా విలువైన మాద‌క ద్ర‌వ్యాల‌ను స్వాధీనం చేసుకున్నారు ఎన్ సీబీ అధికారులు. ఈ దాడుల్లో నలుగురు నిందితులను అరెస్టు చేశారు.. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్‌లో 19 కిలోల గంజాయి, 1.15 కిలోల హైడ్రోపోనిక్ వీడ్, 13,500 నైట్రాజెపామ్ మాత్రలు, 3840 ట్రామాడాల్ మాత్రలు ఉన్నట్టు ఎన్సీబీ అధికారులు తెలిపారు. అరెస్టుల తర్వాత కొన్ని అంతర్జాతీయ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా సిండికేట్‌ లింకులు కూడా బయటపడ్డాయి. అంతర్జాతీయ స్మగ్లింగ్ రింగ్ ఖతార్ రాజధాని దోహాకు కొరియర్ ద్వారా హైడ్రోపోనిక్ వీడ్ అని పిలువబడే హై-గ్రేడ్ ‘బడ్’ని పంపబోతోందని ఎన్సీబీ అధికారులకు సమాచారం అందింది. దీని తర్వాత.. దోహాకు పంపుతున్న పార్శిల్ పై ఎన్‌సిబి అధికారులు ఆరా తీశాయి. దాంతో దాడి చేసి స్వాధీనం చేసుకుంది.

పార్శిల్‌లో మతపరమైన చిత్రాలతో కూడిన 10 ఫోటో ఫ్రేమ్‌లు ఉన్నాయి. వాటి లోపల 1.15 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని దాచినట్టు గుర్తించారు. అదేవిధంగా.. నైట్రాజెపామ్ స్మగ్లింగ్ గురించి కూడా ఎన్సీబీకి సమాచారం అందింది. సమాచారం ఆధారంగా చర్యలు తీసుకుని అందులోని సరుకును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌సీబీ బృందం నిఘా వేసి ముఠా నాయకుడిని అదుపులోకి తీసుకుంది. దాని పార్శిల్‌ను స్వాధీనం చేసుకుని, అందుకున్న వ్యక్తిని కూడా అరెస్టు చేశారు. ఈ డ్రగ్స్ ను ముంబైలో పంపిణీ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఈ కేసులో అరెస్టయిన ముంబైకి చెందిన ఇద్దరు వ్యక్తులకు అంతర్జాతీయ ముఠాలతో సంబంధాలున్నట్టు గుర్తించారు. అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ రాకెట్‌ను ఛేదించడంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విజయం సాధించింది. ధూలే నుంచి ముంబైకి సరుకు రవాణా చేసేందుకు ప్రయత్నించిన ముఠా గుట్టురట్టు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement