ఇప్పుడంతా స్మార్ట్ యుగం.. చేతిలో స్మార్ట్ ఫోన్ లేనివారు బహుశా ఉండకపోవచ్చు. రోజురోజుకూ ఫోన్ల వినియోగం పెరిగిపోతోంది. అయితే దేశంలో ఆండ్రాయిడ్ ఫోన్లనే ఎక్కువగా వాడుతారు. ఎందుకంటే అవి తక్కువ ధరకు వస్తాయి.. చీప్ అండ్ బెస్ట్ కాబట్టి. ఇక ఐ ఫోన్ కొనాలంటే పెద్ద మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఐఫోన్ ఐవోఎస్‌తో పని చేస్తుంది. ఇతర స్మార్ట్‌ఫోన్లన్నీ ఆండ్రాయిడ్ ఓఎస్‌తో నడుస్తాయి. ఇక.. ఆండ్రాయిడ్ యాప్స్‌ను గూగుల్ ప్లేస్టోర్ ద్వారా ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ, అందులో కొన్ని ఫ్రీ యాప్స్ ఉంటాయి. మరికొన్ని ప్రీమియం యాప్స్ ఉంటాయి.
ప్రీమియం యాప్స్ కొనుగోలు చేయాలంటే కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. మరికొన్ని యాడ్స్ ఫ్రీ యాప్స్ కూడా ఉంటాయి. దానికోసమే.. గూగుల్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. 2019లోనే యూఎస్‌లో ఈ సర్వీస్ అందుబాటులోకి వచ్చినప్పటికీ భారత్‌లో తాజాగా ఈ సర్వీస్ అందుబాటులోకి వచ్చింది గుగుల్. దాన్నే గూగుల్ ప్లే పాస్‌గా పిలుస్తారు. దీనికి సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి నెల వారీ ప్లాన్స్ ఉంటాయి.. వార్షిక ప్లాన్స్ నుంచి నెల వారీ ప్లాన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. నెలకు రూ.99 లేదా.. సంవత్సరానికి రూ.889 చెల్లించాల్సి ఉంటుంది. గూగుల్ ప్లే పాస్‌కు సబ్‌స్క్రైబ్ చేసుకున్నాక వివిధ యాప్స్, గేమ్స్‌కు కేవలం ఈ పాస్ ఉన్నవాళ్లకే యాక్సెస్ ఉంటుంది. స్పోర్ట్స్, పజిల్స్, యాక్షన్ గేమ్స్ లాంటి వాటి యాక్సెస్ ఉంటుంది. పాపులర్ గేమ్స్ అయిన జంగిల్ అడ్వెంచర్స్, వరల్డ్ క్రికెట్ బ్యాటిల్ 2, మాన్యుమెంట్ వ్యాలీ లాంటి యాప్స్‌ను ఈ పాస్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు.