Tuesday, November 26, 2024

Breaking: గేమింగ్​ ఆప్​ ​పేరిట మోసం.. రూ.7కోట్లు, ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్న ఈడీ

మొబైల్ గేమింగ్ యాప్ ద్వారా మోసం చేశారన్న ఆరోపణలపై ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కోల్‌కతాలోని ఆరు ప్రాంతాల్లో ఇవ్వాల(శనివారం) సోదాలు నిర్వహిస్తోంది. కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ ప్రాంతంలోని వ్యాపారవేత్త అమీర్ ఖాన్ నివాసాలపై బ్యాంకు అధికారులతో కలిసి ఈడీ అధికారుల బృందం ఈ దాడులు నిర్వహించి దాదాపు రూ.7 కోట్ల నగదు, ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకుంది. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. రికవరీ చేయబడిన నగదుకు సంబంధించిన కచ్చితమైన మొత్తాన్ని నిర్ధారించడానికి లెక్కింపు యంత్రాలను తెప్పించారు. వ్యాపారి నివాసంలో ఇడి సోదాలు జరుగుతున్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో కేంద్ర బలగాలను మోహరించారు.

E-Nuggets అనే మొబైల్ గేమింగ్ యాప్ వినియోగదారులను మోసం చేసినందుకు నిందితుడు అమీర్ ఖాన్, ఇతరులపై ఫెడరల్ బ్యాంక్ అధికారులు చేసిన ఫిర్యాదు మేరకు మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద కేసు నమోదు అయ్యింది. “ప్రారంభ కాలంలో వినియోగదారులు కమీషన్‌ని అందుకున్నారు. వాలెట్‌లోని బ్యాలెన్స్ అవాంతరాలు లేకుండా విత్​డ్రా చేసుకునేలా వెసులుబాటు కల్పించారు. దీంతో చాలామంది దీన్ని విశ్వసించారు. అంతేకాకుండా ఎక్కువ శాతం కమీషన్, ఎక్కువ సంఖ్యలో కొనుగోలు ఆర్డర్‌ల కోసం పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడం ప్రారంభించారు” అని ED తెలిపింది.

ప్రజల నుండి పెద్దమొత్తన్ని సేకరించిన తర్వాత అకస్మాత్తుగా యాప్ నుండి విత్​డ్రా, సిస్టమ్ అప్‌గ్రేడేషన్, ఇన్వెస్టిగేషన్ అనే సాకుతో యాప్​ని ఆపేసినట్టు మోసగాళ్ల విధానాన్ని ఈడీ వివరించింది. LEAలు మొదలైన వాటి ద్వారా ఆ తర్వాత, పేర్కొన్న యాప్ సర్వర్‌ల నుండి ప్రొఫైల్ సమాచారంతో సహా మొత్తం డేటా తొలగించారని, అప్పుడు వారి మోసాన్ని అర్థం చేసుకున్న చాలామంది ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement