Saturday, November 23, 2024

వాసాలమర్రిలో రేపటి నుంచే దళిత బంధు అమలు

యాదాద్రి భువనగిరి జిల్లాలోని వాసాలమర్రిలో సీఎం కేసీఆర్ బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా దళితులపై ఆయన వరాలు కురిపించారు. వాసాలమర్రిలో మొత్తం 76 దళిత కుటుంబాలు ఉన్నాయని, వారికి తక్షణమే దళిత బంధు పథకాన్ని అమలు చేస్తామని కేసీఆర్ తెలిపారు. ఈ మేరకు దళితుల అకౌంట్లలో రేపటి నుంచి రూ.10 లక్షల నగదు జమ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. దళిత సొమ్ము భద్రతపై పూర్తి బాధ్యత దళితులదేనని, ఆ డబ్బులతో ఎలాంటి వ్యాపారమైనా చేసుకోవచ్చని కేసీఆర్ సూచించారు.

కాగా దళితెలె ఇంకా పేదరికంలోనే ఉన్నారని.. దళిత సమాజం కోసం అంబేద్కర్ ఎన్నో పోరాటాలు చేశారని కేసీఆర్ గుర్తుచేశారు. దళితుల్లో ఐకమత్యం రావాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. కాగా ఆలేరు నియోజకవర్గంలో రూ.30 కోట్లతో దళిత రక్షణ నిధి ఏర్పాటు చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఏదైనా ప్రమాదం జరిగినా, ఎవరికైనా అనారోగ్యం దరి చేరినా ఈ నిధి నుంచే ఖర్చు చేస్తామని తెలిపారు. వాసాలమర్రి ఆలేరు నియోజకవర్గానికి దారి చూపాలని కేసీఆర్ సూచించారు.

ఈ వార్త కూడా చదవండి: రూ.లక్ష దాటనున్న తులం బంగారం ధర

Advertisement

తాజా వార్తలు

Advertisement