Friday, November 22, 2024

బాలికపై ట్యూషన్​ టీచర్​ అఘాయిత్యం, హత్య.. బాధిత కుటుంబానికి రూ.10లక్షల పరిహారం

కర్నాటక రాష్ట్రం మాండ్య జిల్లా మలవల్లిలో ఓ బాలికపై ట్యూషన్​ టీచర్​ అఘాయిత్యానికి పాల్పడి ఆపై హతమార్చిన ఘటన జరిగింది. దీనిపై సీఎం బస్వరాజు బొమ్మై స్పందించారు. ఈ ఘటనతో తాను షాక్​కి గురయ్యానని, ఇట్లాంటి ఘోరం జరగకూడదన్నారు. మానవత్వం లేని వారి పనిగా లైంగిక దాడిని అభివర్ణించారు. నిందితుడిని అరెస్టు చేయాలని, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు సీఎం బొమ్మై. అంతేకాకుండా బాధిత బాలిక కుటుంబానికి 10 లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు.

వారం రోజుల్లోగా ఫోరెన్సిక్ నివేదిక అందజేసి, ఆ తర్వాత  చార్జిషీటును రెడీ చేసి పోక్సో కోర్టులో దాఖలు చేయాలన్నారు ముఖ్యమంత్రి బొమ్మై. బాధితులకు సత్వర న్యాయం, నిందితులకు కఠిన శిక్ష పడేలా అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఇక.. బెంగళూరు-మైసూరు ఎక్స్ ప్రెస్ హైవేపై వర్షపు నీరు తరచుగా చేరడంపై స్పందించారు ముఖ్యమంత్రి బస్వరాజు బొమ్మై. ఈ విషయమ్మీద మాట్లాడుతూ.. అది డిజైన్ లోపం వల్ల జరుగుతుందా? లేక నిర్వహణ సమస్యల వల్ల జరుగుతుందా! అనే దానిపై అధికారులతో చర్చిస్తానన్నారు. హైవేపై నీరు చేరకుండా చర్యలు తీసుకోవాలని, బ్లాక్‌స్పాట్‌లను గుర్తించాలని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులకు చెప్పి తక్షణమే చర్యలు తీసుకునేలా చూస్తానన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement