తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పెరుగుతోంది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కంటే.. తామే టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం అనే హుజురాబాద్ గెలుపుతో మరోసారి నిరూపించింది. హుజురాబాద్ లో ఈటల గెలుపు బీజేపీకి కొత్త ఊపు తెచ్చింది. ఇదే స్ఫూర్తితో వచ్చే ఎన్నిక నాటికి తెలంగాణలో అధికారం చేపట్టాలని వ్యూహాలు పన్నుతోంది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జరిగిన ఎన్నికల్లో బీజేపీ తన సత్తా చాటుతోంది. దుబ్బాక ఉపఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గెలుపుతో దుమ్ములేపిన బీజేపీ.. హుజురాబాద్ ఉపఎన్నికతో మరోసారి తన స్టామినా చూపించింది. ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ గెలుపొందారు. ఎన్నికల ప్రచారంలో సంరద్భంగా అసెంబ్లీలో ఆర్ఆర్ఆర్ వాయిస్ వినిపించబోతోందని చేసిన జోస్యం నిజమైందంటూ చర్చలు జరుగుతున్నాయి.
హుజురాబాద్ ఎన్నికల ప్రచారం సందర్భంగా.. ఉద్యమకారుడు ఈటల రాజేందర్ ను గెలిపించాలని హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు. రాజేందర్ గెలిచిన తర్వాత అసెంబ్లీలో ఆర్ఆర్ఆర్ కాంబినేషన్ ప్రజాగళం వినిపిస్తారని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం అధికార పార్టీపై ఒత్తిడి తెస్తారని చెప్పారు. బిజెపి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రాజాసింగ్, దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం సాధించిన రఘునందన్ రావు, ఇప్పుడు హుజురాబాద్ నుండి రాజేందర్ (ఆర్ఆర్ఆర్) గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఆర్ఆర్ఆర్ త్రయం ప్రజా సమస్యల కోసం అసెంబ్లీ వేదికగా పోరాటం చేస్తారని పేర్కొన్నారు. ఇప్పుడు అదే అక్షర సత్యం అయింది. బండి సంజయ్ చెప్పిందే నిజమవుతుందని ఇటు బీజేపీ వర్గాలలో, అటు ప్రజలలోనూ చర్చ జరుగుతుంది.
ఇది కూడా చదవండి: TRS ఎమ్మెల్యేకు తలనొప్పి.. గవ్వల రాజీనామా ఎప్పుడు?