Monday, November 18, 2024

నాటు నాటుకి గోల్డెన్ గ్లోబ్ అవార్డ్.. ఆర్ ఆర్ ఆర్ టీంకి విషెష్ ల వెల్లువ‌

గోల్డెన్ గ్లోబ్ అవార్డులు..2023వేడుక అమెరికాలోని కాలిఫోర్నియాలో జ‌రుగుతుంది.ఆర్ ఆర్ ఆర్ చిత్రంలోని నాటు నాటు సాంగ్ ప్రఖ్యాత గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డును దక్కించుకుంది. నాటునాటు’ పాట ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ఉత్తమ పాటగా ఎంపికైంది. అతిరథ మహారథుల మధ్య ఈ అవార్డును సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి అందుకున్నారు. ప్రముఖ రచయిత చంద్రబోస్‌ ఈ పాటకు సాహిత్యం అందించారు. కాగా గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉందని మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎంఎం కీరవాణి అన్నారు. ప్రతిష్ఠాత్మక అవార్డు ఇచ్చిన హెచ్‌ఎఫ్‌పీఏకు ధన్యవాదాలు తెలిపారు. గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు తన సోదరుడు..ద‌ర్శ‌కుడు రాజ‌మౌళికి దక్కాలని చెప్పారు. పాటలో భాగమైన రాహుల్‌ సిప్లిగంజ్‌కు ధన్యవాదాలు తెలిపారు. పాటకు కాళభైవర అద్భుత సహకారం అందిచారన్నారు. సంతోష సమయాన్ని తన భార్యతో పంచుకోవడం ఆనందంగా ఉందన్నారు.

ఈ నేపథ్యంలో సోషల్‌ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా స్వర మాంత్రికుడు ఏ.ఆర్‌ రెహమాన్‌ దీనిపై స్పందిస్తూ.. ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌కు విషెస్‌ చెప్పాడు. కీరవాణి, రాజమౌళితో పాటు చిత్రయూనిట్‌ మొత్తానికి భారతీయులందరి తరుపున రెహమాన్‌ శుభాకాంక్షలు తెలిపాడు. ప్రస్తుతం రెహమాన్‌ వేసిన ట్వీట్‌ నెట్టింట వైరల్‌గా మారింది

కాగా ఇదొక చారిత్రక విజయమంటూ.. దీనిపట్ల దేశం గర్విస్తోందన్నారు. సంగీత దర్శకుడు కీరవాణి ఇతర చిత్రబృందాన్ని మెచ్చుకుంటూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు.ఇదొక అద్భుతమైన, చారిత్రక విజయం. ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ‘నాటునాటు’కి గానూ కీరవాణి గోల్డెన్‌గ్లోబ్‌ అందుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌కు నా అభినందనలు. దేశం మిమ్మిల్ని చూసి గర్విస్తోందన్నారు. సంగీతం, డ్యాన్స్.. ఈ రెండింటి సెలబ్రేషనే ‘నాటునాటు’. మన దేశమే కాదు ప్రపంచం మొత్తం ఈరోజు మీతో కలిసి డ్యాన్స్‌ చేస్తోంది. స్టార్ హీరోలు రామ్ చరణ్‌, ఎన్టీఆర్ తో పాటు అద్భుతమైన సాహిత్యం అందించిన చంద్రబోస్‌, ఉర్రూతలూగించేలా ఆలపించిన రాహుల్‌, కాలభైరవ, కొరియోగ్రాఫర్‌ ప్రేమ్‌ రక్షిత్‌కు కంగ్రాట్స్ అని పేర్కొన్నారు.ఈ క్రమంలో పలువురు సినీ ప్రముఖులు చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement