ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి చేస్తున్న ఈ మూవీని చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా చరిత్రలో ఎప్పుడూ కలవని ఇద్దరు వీరులను కలిపి చూపించే ప్రయత్నం చేస్తున్నారు రాజమౌళి. ఇందులో రామ్ చరణ్.. అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తోండగా.. ఎన్టీఆర్… గిరిజన వీరుడు కొమురం భీమ్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఆర్ఆర్ఆర్ ట్రైలర్‌తో ఈ సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో హింట్ ఇచ్చారు మేకర్స్. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈమూవీ జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుందన్న తరుణంలో ఈ సినిమా విడుదల వాయిదా పడే అవకాశముందని రూమర్స్ వస్తున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా, ఒమిక్రాన్ కేసులు భారీగా పెరుగుతున్న ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ సినిమా పైన ఆ ప్రభావం పడబోతోందంటూ ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతమున్న పరిస్థితుల దృష్ట్యా ఆర్ఆర్ఆర్ వాయిదా పడబోతుందంటూ ఫిల్మ్ సర్కిల్లో టాక్ నడుస్తోంది. అయితే మహారాష్ట్ర, కర్ణాటక, న్యూఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాల్లో రాత్రిపూట కర్ఫ్యూలతో పాటు థియేటర్లలో 50% ఆక్యుపెన్సీ, ఇంకా పలు ఆంక్షలు విధించారు. అలాగే ప్రస్తుతం ఏపీలో టికెట్స్ రేట్స్ రగడ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా ముందుగా నిర్ణయించిన డేట్ న విడుదలవుతుందా ? లేదా ? అనేది చూడాలి మరి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital