ఆర్ ఆర్ ఆర్ పాన్ ఇండియా చిత్రంగా , దర్శకుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. కాగా ఈ చిత్రంలో ఇద్దరు స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ లు నటిస్తున్నారు. ఈ చిత్రం రిలీజ్ కోసం మెగా, నందమూరి ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. కాగా ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 7న రిలీజ్ కానుంది. కాగా ఆదివారం (డిసెంబర్ 19)న RRR ప్రీ రిలీజ్ ఈవెంట్ ముంబైలో జరగబోతుంది. బాలీవుడ్ సెలబ్రీటీలు ఈ వేడుకకి హాజరు కాబోతున్నారు. ఇప్పటికే రామ్ చరణ్, ఎన్టీఆర్ అండ్ టీమ్ ముంబైకి చేరుకున్నారు. అక్కడి మీడియాకి ప్రత్యేకమైన ఇంటర్వ్యూలు ఇచ్చే పనిలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సాధారణంగా రాజమౌళి తన ప్రతి సినిమాలో ప్రతి చిన్న విషయాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించి తెరకెక్కిస్తుంటారు. ముఖ్యంగా హీరోల లుక్స్‌తో పాటు వారు ఉపయోగించే వస్తువులను కూడా రాజమౌళి స్పెషల్‌గా డిజైన్ చేయిస్తుంటారు. ఆర్ ఆర్ ఆర్ సినిమాలో రామ్ చరణ్ గుర్రాన్ని ఉపయోగిస్తే.. ఎన్టీఆర్ మోటార్ బైక్‌ను ఉపయోగించారు.
ఎన్టీఆర్ బైక్ మోడల్ గురించి రాజమౌళి చాలా రీసెర్చే చేశారు. దీని పేరు వెలో సెట్ మోటార్ బైక్. బ్రిటన్‌కు చెందింది. ఈ కంపెనీ హెడ్ ఆఫీసు బర్మింగ్ హామ్‌లో ఉంది. ఇక ఎన్టీర్ ఉపయోగించిన బైక్ 1934కి చెందిన ఎమ్ సిరీస్ మోడల్‌లా కనిపిస్తుంది. ఇక వెలోసెట్ మోటార్ బైక్ కంపెనీ 1920 నుంచి 1950 వరకు అంతర్జాతీయ మోటార్ రేసింగ్ విభాగంలో టాప్‌గా ఉండేది. 350 సీసీ, 500 సీసీ బైకులను తయారు చేసింది. 1971లో ఈ కంపెనీ బైకుల ఉత్పత్తిని పూర్తిగా ఆపేసింది. RRR కోసం ఎన్టీఆర్‌కు బైక్ కావాలనుకున్నప్పుడు రాజమౌళి అప్పట్లో బైకుల ఉత్పత్తి చేయడంలో ఎవరు టాప్.. వారు తయారు చేసిన మోడల్స్ ఏంటి అనే వాటిని జాగ్రత్తగా పరిశీలించి..ఇప్పుడున్న మోటార్ బైకునే అప్పటి మోడల్‌లో కనిపించేలా దాదాపు పది లక్షల రూపాయలను ఖర్చు పెట్టి మార్పులు, చేర్పులు చేసి మార్చారు. ఇప్పుడీ బైక్ గురించి మాట్లాడుకుంటున్నారు అంతా.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..