ఈ మధ్యకాలంలో సినిమాల్లోని పలు సీన్స్ పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు పలువురు. ఈ మేరకు కోర్టుల వరకు వెళ్లుతోంది వ్యవహారం. కాగా ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని పలు వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఈ చిత్రం రిలీజ్ కాకుండానే వివాదాల్లో చిక్కుకుంటోంది. కాగా ఈ సినిమాలో చరిత్రని వక్రీకరించారని ఇప్పటికే కోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి కూడా రీసెంట్ గా మరో పిటిషన్ హైకోర్టులో దాఖలయింది. ఈ మూవీలో అల్లూరి సీతారామరాజు పాత్రను జూనియర్ ఎన్టీఆర్ పోషించగా, గిరిజన వీరుడు కొమురం భీమ్ పాత్రను ఎన్టీఆర్ పోషించాడు. అల్లూరిని బ్రిటీష్ పోలీసుగా చూపించారంటూ అల్లూరి యువజన సంఘం జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు వీరభద్రరావు హైకోర్టులో పిటిషన్ వేశారు. అల్లూరిని బ్రిటీష్ పోలీసుగా చూపించడం దారుణమని అన్నారు. అల్లూరి, కుమురం భీమ్ లు కలిసినట్టు చరిత్రలో లేదని, చరిత్రను వక్రీకరించి చూపించిన ఘట్టాలను తొలగించాలని కోరారు. దాంతో ఆర్ ఆర్ ఆర్ మరోసారి వార్తల్లో నిలిచింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..