రోప్ వే ప్రమాదంలో 30మందిని భారత వాయుసేన కాపాడింది. కాగా జార్ఖండ్ రాష్ట్రంలోని దియోగఢ్ వద్ద త్రికూట పర్వతాలపై ఆదివారం సాయంత్రం జరిగిన రోప్ వే ప్రమాదంలో 30 మందిని భారత వాయుసేన కాపాడింది. కాగా మంగళవారం మరో 14 మంది పర్యాటకులు రోప్ వే మార్గంపై కేబుల్ కార్లలోనే చిక్కుకుని ఉన్నారు. వారిని రక్షించే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.
ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు. ప్రమాదం జరిగినప్పుడు ఒకరు మరణించారు. వాయుసేన హెలికాప్టర్ లోకి వ్యక్తిని తాడు సాయంతో తీసుకెళ్లే ప్రయత్నంలో చేయి జారడంతో అతడు కిందపడిపోయి ప్రాణాలు కోల్పోయాడు. రోప్ వే మార్గంలో రెండు కేబుల్ కార్లు ఢీకొనడమే ఈ ప్రమాదానికి కారణం అని అధికారులు తెలిపారు.
రోప్ వే ప్రమాదంలో ఇద్దరు మృతి – కొనసాగుతోన్న రెస్క్యూ ఆపరేషన్
Advertisement
తాజా వార్తలు
Advertisement