Saturday, November 16, 2024

రోల్స్‌రాయిస్‌ నుంచి తొలి ఎలక్ట్రిక్‌ కారు ఇదే..

బీఎమ్‌డబ్య్లూకు చెందిన ప్రముఖ బ్రిటన్‌ లగ్జరీ కార్ల తయారీ సంస్థ రోల్స్‌రాయిస్‌​ కూడా ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీపై దృష్టిపెట్టింది. రోల్స్‌రాయిస్‌ ఎలక్ట్రిక్‌ కార్ల శ్రేణిలో ‘స్పెక్టర్‌’ తొలి కారుగా నిలవనుంది. రోల్స్‌రాయిస్‌ తన తొలి ఎలక్ట్రిక్‌ కార్‌  స్పెక్టార్‌ను 2023 నాలుగో త్రైమాసికంలో కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటుందని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని​ రోల్స్‌రాయిస్‌ కీలక నిర్ణయాలను తీసుకుంది.   2030 నాటికి ఎలక్ట్రిక్ కార్లను మాత్రమే ఉత్పత్తి చేస్తుందని..శిలాజ ఇంధనాల కార్ల ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేయనుందని రోల్స్ రాయిస్ సీఈవో బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. 

మరోవైపు రోల్స్‌రాయిస్‌ పేరెంట్‌ సంస్థ బీఎమ్‌డబ్ల్యూ ముడిచమురునుపయోగించి వాడే కార్లను ఎప్పుడూ నిలిపివేయనుందనే విషయం స్పష్టంగా లేదు. కానీ 2030 నాటికి 50 శాతం ఎలక్ట్రిక్‌ వాహనాల ఉత్పత్తి చేస్తోందని కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. టాటా మోటార్స్‌కు చెందిన జాగ్వార్‌ ల్యాండ్‌రోవర్‌ కూడా 2025 నాటికి ఎలక్ట్రిక్‌వాహనాలను ఉత్పత్తి చేయనుంది.

ఇది కూడా చదవండి: ‘నో టైమ్ టు డై’ రివ్యూ: పసలేని జేమ్స్ బాండ్..

Advertisement

తాజా వార్తలు

Advertisement