Tuesday, November 26, 2024

Roja: రోజాకు ఈసారి కేబినెట్లో బెర్త్ ఖాయమేనా?

వైసీపీ ఫైర్‌ బ్రాండ్ ఎమ్మెల్యే రోజాకు రాజకీయం కలిసి రావడం లేదా? అధికారంలోకి వస్తే అందలమెక్కడం ఖాయమనే లెక్కలు ఎప్పటికప్పుడు తప్పుతున్నాయా? రాజకీయ సుడిగుండాల్లో ఉన్న రోజాకు ఆశించిన పదవి దక్కుతుందా? ఈసారైనా అమాత్య యోగం పడుతుందా? మంత్రి పదవిని ఆశిస్తున్న రోజాకు ముఖ్యమంత్రి సరేనంటారా సర్దుకోమంటారా? అదే నిజమైతే అప్పుడు ఏపీఐఐసీ, ఇప్పుడు ఏంటి?

ఏపీలో దసరా తరువాత మంత్రివర్గ విస్తరణ ఉండబోతోందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈసారి కొత్త మంత్రులు రాబోతున్నారన్న చర్చ జరుగుతున్నా ఆ కొత్తవారు ఎవరన్నదే ఇప్పుడు హాట్‌ టాపిక్. అప్పట్లో అన్నీ ఈక్వేషన్లను లెక్కలేసి చక్కగా కూర్చిపెట్టి ఏర్పాటు చేసుకున్న మంత్రివర్గానికి సీఎం జగన్ ఇచ్చిన సమయం దాదాపు ముగిసిపోతోంది. రెండున్నరేళ్ల తర్వాత మళ్లీ మంత్రుల మార్పు ఉంటుందని అప్పట్లోనే ప్రకటించడంతో పొజీషన్‌లో ఉన్న వారందరూ కూడా క్లారిటీతో ఉన్నారు. కొత్తగా మంత్రి పదవులు ఆశిస్తున్న వారి సంఖ్య గణనీయంగానే ఉంది.

చంద్రబాబును ఎదుర్కోవడంలో గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి నేటి వరకు రోజా దూకుడుగా వ్యవహరించడం జగన్ కు చాలా నచ్చింది. ఈ నేపథ్యంలో ఆమెను మంత్రి పదవిలోకి తీసుకుంటున్నట్లు వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే వైసీపీ అధినేత, సీఎం జగన్ మనసులో ఏముందనేది అనేది మాత్రం సస్పెన్స్ గానే ఉంది. తొలి కేబినెట్ లోనే తనకు అవకాశం ఇస్తారని భావించారు. అప్పటి సామాజిక సమీకరణాలు.. జిల్లాలో రాజకీయ పరిస్థితులతో పదవి దక్కలేదు. ఆమెను బుజ్జగించేందుకు ఏఐసీసీ చైర్మన్ పదవి కట్టబెట్టారు. కొద్ది నెలల క్రితం ఆమెను ఆ పదవి నుంచి తప్పించారు.

 రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని జగన్ సీఎం గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చన్న ప్రచారం నేపధ్యంలో ఇప్పుడు రోజాను ఏపీఐఐసీ నుంచి తప్పించడం మంత్రి పదవి ఇవ్వడం కోసమేనంటూ ప్రచారం జరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement