హీరో మాధవన్ రచించి దర్శకత్వం వహించడమే కాదు చిత్రంలోని టైటిల్ రోల్ ని ప్లే చేశారు. ఆ చిత్రమే రాకెట్రీ.ఈ చిత్రం నుండి కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు.ఇస్రోలో ఏరో స్పేస్ ఇంజినీర్ గా పని చేసిన నంబి నారాయణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. ప్రిన్స్ టన్ యూనివర్సిటీలో చదువుకున్నప్పటి నుంచి నంబి నారాయణన్..భారత రహస్యాలను ఇతర దేశాలకు అందించారనే తప్పుడు ఆరోపణలతో అరెస్ట్ అయ్యారు. అయితే అవి ఆరోపణలు మాత్రమే అతను ఏ తప్పు చేయలేదని తర్వాత నిరూపితమైంది. విలన్ గా మారిన గొప్ప శాస్త్రవేత్త, నిజమైన దేశ భక్తుడు..నంబి నారాయణన్ అని పేర్కొంటూ సరి కొత్త పోస్టర్ విడుదల చేశారు యాక్టర్ మాధవన్. వచ్చే నెల 1న ఈ సినిమా దేశవ్యాప్తంగా విడుదల కానుంది. ఇంగ్లిష్ భాషలోనూ ఈ పిక్చర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. కొత్త పోస్టర్ లో మువ్వన్నెల జెండాతో పాటు రాకెట్ చిత్రంలో మాధవన్ ఉండటం సరికొత్తగా ఉంది. ఈ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement