రోబోటిక్ సేవలలో చైనా మెటావర్స్ కంపెనీ అసాధారణ నిర్ణయం తీసుకుంది. కంపెనీ సీఈవో బాధ్యతల్లో ఓ రోబోను నియమించింది. ఈ ప్రయత్నంతో కృత్రిమ మేథ ఆధారిత హ్యూమనాయిడ్ రోబోట్ ఎగ్జిక్యూటివ్ స్థానానికి అధ్యక్షత వహించిన మొట్టమొదటి రోబోట్‌గా టాంగ్‌యు రికార్డుకెక్కింది. నెట్‌డ్రాగన్ వెబ్‌సాప్ట్ అనేది మొబైల్ కోసం అప్లికేషన్‌లను తయారు చేసే ఒక చైనీస్ కంపెనీ. ఇది మల్టిప్లేయర్ ఆన్‌లైన్ గేమ్‌లను కూడా నిర్వహిస్తుంది. కంపెనీ ప్రధాన అనుబంధ సంస్థ ఫుజియాన్ నెట్‌డ్రాగన్ వెబ్‌సాప్ట్ పనిని పర్యవేక్షించడానికి ఇది హ్యూమనాయిడ్ రోబోట్‌ను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమించింది. 10బిలియన్ డాలర్ల విలువైన సంస్థకు నాయకత్వం వహించడానికి వర్చువల్ సీఈవోను సేవలను ఉపయోగిస్తున్నాం.
కంపెనీ సంస్థాగత, సమర్థతా విభాగాలను ఇది చూసుకోవాలని కంపెనీ భావిస్తోంది అని నెట్ డ్రాగన్ సీఈవో చెప్పారు. మా వ్యాపారం అంతిమంగా మా భవిష్యత్ వ్యూహాత్మక వృద్ధిని నడిపిస్తుంది. రోబోట్ చాలా సబ్జెక్టివ్, మానవ స్పర్శ అవసరమయ్యే పనులను కూడా చేస్తుందని కంపెనీ పేర్కొంది. ఇది ప్రతిభను అభివృద్ధి చేసే పనులను చేపడుతుంది ఉద్యోగులందరికీ ఆరోగ్యకరమైన పని వాతావరణాన్ని అందించడానికి మానవ వనరుల నిర్వహణలో పని చేస్తుంది. ఈ మహిళా రోబోట్ పనుల నాణ్యతను మెరుగుపరుస్తుంది. అమలు వేగాన్ని మెరుగుపరుస్తుంది. రోబోట్ రోజువారీ కార్యకలాపాలలో హేతుబద్ధమైన నిర్ణయం తీసుకోవడానికి, మరింత ప్రభావవంతమైన రిస్క్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను ప్రారంభించడంలో కంపెనీకి సహాయపడుతుందని సంస్థ పేర్కొంది.