Tuesday, November 26, 2024

పహాడీ షరీఫ్ లో దారి దోపిడీ కేసు.. నిందితులను పట్టుకున్న రాచకొండ పోలీసులు

హైదరాబాద్ నగర శివారు పహాడీ షరీఫ్ లో ఓ మూఠా దారి దోపిడీకి పాల్పడిన సంగతి తెలిసిందే. తాజాగా  ఈ ఘటనకు సంబంధించిన వివరాలను రాచకొండ సీపీ మహేష్ భగవత్ వెల్లడించారు. ఈ నెల 17 తేదీన పహాడీ షరీఫ్ లో  హరియానా గ్యాంగ్ దోపిడీ చేసిందన్నారు. గ్యాంగ్ వారితో ఉన్నా తుపాకీ చూపించి దోపిడీ చేశారని చెప్పారు. తమిళనాడు నుండి వస్తున్న లారీని హరియానా గ్యాంగ్ లిఫ్ట్ పేరుతో ఆపేశారని, లారీ డ్రైవర్, క్లినర్ ను చేతులు కట్టేసి క్యాబిన్ లో పడేశారని చెప్పారు. లారీలో ఉన్న 192 MRF టైర్లును రాబరీ చేశారని తెలిపారు. డ్రైవర్, క్లినర్ ను గన్ తో బెదిరించి లారీను తీసుకొని పోయారని వివరించారు. లారీ ఎక్కగానే డ్రైవర్ పై దాడి చేసి, తుపాకీతో బెదిరించి వారి చెప్పిన విధంగా లారీను కాటేదాన్ కు తీసుకొచ్చారని చెప్పారు. కాటేదాన్ లో ఓ గోదాంలో టైర్లు అన్ని అన్లోడ్ చేశారని సీపీ పేర్కొన్నారు. దీంతో పోలుసులకు వచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామన్నారు. సిసి ఫుటేజ్ లో నమోదైన దృశ్యాలు ఆధారంగా నిందితులును అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. టవర్ లోకేషన్, CDR ఆధారంగా నిందితులను పట్టుకున్నామన్నారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడు జంషెద్  ఖాన్ అలియాస్ జమ్మి విమానంలో పారిపోయాడని చెప్పారు. వెంటనే ఢిల్లీ పోలీసులు, CISF సహాయంతో ఢిల్లీ ఎయిర్ పోర్ట్ అరెస్ట్ చేశామన్నారు. జంషెద్ ఖాన్, రహిల్ ఖాన్ ఇద్దరు లారీ ఎక్కి దోపిడీ చేశారని వివరించారు. జంషెద్ ఖాన్ ఒక రౌండ్ కాల్పులు జరిపినట్లు వెల్లడించారు. తుపాకీ ఉంటే విమానంలో వెళ్లడం కష్టం అని తుపాకీని రహిల్ ఖాన్ అప్పగించి విమానంలో వెళ్ళిపోయాడన్నారు. హైదరాబాద్ కి చెందిన సయ్యద్ బాసిత్ హుసేన్, కమల్ కబ్రా సహాయంతో గోదాంకి తరలించారన్నారు. ఈ గ్యాంగ్ లో నలుగురిని అరెస్ట్ చేశామన్న సీపీ.. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఈ గ్యాంగ్ జనవరి 18 తేదీన అపోలో టైర్లతో వెళుతున్న 220 టైర్లు లారీని ఇలాగే దోపిడీ చేసినట్లు చెప్పారు. అయితే, దీనిపై ఇప్పటి వరకు ఎవరు కూడా ఫిర్యాదు చేయలేదన్నారు. తమిళనాడు, హరియానాకి టీమ్స్ పంపించి విచారణ చేస్తామని సీపీ మహేష్ భగవత్ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement