Thursday, November 21, 2024

రేడిమిక్స్ వాహనాల నిర్లక్ష్యం.. ప్రమాదం జరిగితే బాధ్యులెవరు ?

జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘనపురం మండల కేంద్రంలోని రేడిమిక్స్ వాహనాలు నిర్లక్ష్యంగా నడిపిస్తున్నడంతో వాహనదారులకు ప్రమాదం పొంచి ఉంది. జయశంకర్ జిల్లా గణపురం మండలంలో బుర్రకాయల గూడెం, మైలారం సమీపంలో రెండు రెడ్ మిక్స్ కేంద్రాలు ఉన్నాయి. నిత్యం వివిధ నిర్మాణాలకు, సిసి రోడ్డు నిర్మాణాలకు ఈ కేంద్రాలనుండి లారీల ద్వారా కంకర, సిమెంట్, ఇసుక మిక్స్ చేసిన మిశ్రమాన్ని తరలిస్తున్నారు. అయితే ఆ మిశ్రమాన్ని లారీలలో తరలిస్తున్న క్రమంలో జాగ్రత్త వహించాల్సిన సదరు యాజమాన్యాలు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ప్రధాన రహదారి వెంట ఆ మిశ్రమం ధారాళంగా పడిపోతుంది. దీంతో ప్రధాన రోడ్డుపై కంకర సిమెంట్ మిశ్రమం పడి గడ్డకట్టడంతో నిత్యం రహదారిపై ప్రయాణించే వాహనదారులు స్కిడ్ అయి పడిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గత రెండు మూడు రోజులుగా ప్రధాన రహదారిపై సాయిబాబా టెంపుల్ నుండి ప్రధాన సెంటర్ వరకు ఆ మిశ్రమం రోడ్డు వెంట పేరుకు పోయింది. బాంక్ , ప్రైవేట్ పాఠశాల ఉండటంతో నిత్యం స్కూల్ విద్యార్థులు సైకిళ్లపై, ద్విచక్ర వాహనదారులు వస్తుంటారు. ఆ మిశ్రమం చెల్లాచెదురుగా రోడ్డుపై ఉండడంతో వానలు అదుపు తప్పి కిందపడుతున్నారు. ప్రధాన రోడ్డుపై ఇంత నిర్లక్ష్యంగా రెడీ మిక్స్ మిశ్రమం పడి మూడు రోజులు గడుస్తున్నా ఆర్అండ్ బి అధికారులు గాని , రెడ్ మీ రెడ్ మిక్స్ వాహనయాజమాన్యాలు దారులు కానీ, జి పి సిబ్బంది గానీ పట్టించుకోవడం లేదు. ఏదైనా పెను ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరని వాహనదారులు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న రేడిమిక్స్ యాజమాన్యంపై చర్యలు తీసుకుని మరోసారి పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement