Saturday, November 23, 2024

ఒక్కటైన లాలూ, శరద్‌యాదవ్‌.. ఆర్‌జేడీలో ఆర్‌ఎల్‌డీ విలీనం, 25 ఏళ్ల తర్వాత కలిసిన మిత్రులు

ప్రముఖ సోషలిస్టు నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి శరద్‌ యాదవ్‌ మళ్లిd లాలూ ప్రసాద్‌ యాదవ్‌తో చేతులుకలిపారు. తన లోక్‌తాంత్రిక్‌ జనతాదళ్‌ (ఎల్‌జేడీ)ని రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్‌ఎల్‌డీ)లో విలీనం చేశారు. 25 ఏళ్ల కిందట విడిపోయిన ఈ జోడీ ఆదివారం ఒక్కటైంది. ఈ పరిణామం జాతీయ స్థాయిలో విపక్షాల ఐక్యతకు తొలి అడుగుగా శరద్‌ యాదవ్‌ అభివర్ణించారు. భాజపాకు వ్యతిరేకంగా బలమైన ప్రతిపక్షం అవసరమని, ఇందుకు భావసారూప్య పార్టీలు కలసికట్టుగా ముందుకెళ్లాలని సూచించారు.

జనతాదళ్‌ ఏకీకరణకు నాంది..
విపక్షాల ఏకీకరణకు ఈ విలీనం ఓ నాందీ ప్రస్తావనగా శరద్‌యాదవ్‌ అభివర్ణించారు. కేంద్రంలోని బీజేపీని ఓడించడానికి ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. మొట్ట మొదట ప్రతిపక్షాల మధ్య ఐక్యత కుదరాలని, ఆ తర్వాత దానిని ఎవరు ముందుకు తీసుకెళ్లాలో ఆలోచిస్తామని స్పష్టం చేశారు. పూర్వపు జనతాదళ్‌లోని వివిధ చీలికలను ఏకతాటిపైకి తీసుకొచ్చే తన ప్రయత్నాల్లో ఇది ఆరంభమని చెప్పారు. దేశంలో బలమైన ప్రతిపక్షాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ తరం యువతదే భవిష్యత్తు. ఇకపై ఆర్జేడీ మన పార్టీ. నేను మునుపటిలా చురుగ్గా పనిచేయలేను. కానీ తేజస్విని బలపరచడానికి నా వంతు కృషి చేస్తాను. మా పోరాటాన్ని బలోపేతం చేసేందుకు అఖిలేశ్‌తోనూ మాట్లాడతాను. లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఏదోఒక రోజు స్వేచ్ఛగా బయటకు వస్తారని విశ్వసిస్తున్నాను. మతతత్వ శక్తులతో రాజీపడి ఉంటే ప్రస్తుతం అతను జైలులో ఉండేవాడు కాదని చెప్పారు.

1997లో చెదిరిన చెలిమి…
లాలూ ప్రసాద్‌కి చెందిన జనతాదళ్‌ నుంచి శరద్‌ యాదవ్‌ 25 ఏళ్ల కిందట బయటకు వెళ్లారు. ఆ తర్వాత నితీశ్‌ కుమార్‌తో కలిసి, శరద్‌ యాదవ్‌ చాలా కాలం ప్రయాణించారు. ఇద్దరి మధ్యా పొరపొచ్చాలు రావడంతో 2018లో లోక్‌ తాంత్రిక్‌ జనతాదళ్‌ పార్టీని స్థాపించారు. అయినా ఆ పార్టీ ఎన్నికల్లో పోటీచేయలేదు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో శరద్‌యాదవ్‌ మాధేపురా నుంచి ఆర్జేడీ టిక్కెట్‌పై పోటీచేసి ఓటమి పాలయ్యారు.

ప్రజల కోరికమేరకే.. : తేజస్వీ
శరద్‌ యాదవ్‌ తన పార్టీని ఆర్జేడీలో విలీనం చేయడంపై ఆ పార్టీ అధ్యక్షుడు తేజస్వీ యాదవ్‌ స్పందించారు. ప్రజల ఆకాంక్ష మేరకు ఈ నిర్ణయం జరిగిందన్నారు. ప్రతిపక్షాలకు ఓ మెసేజ్‌ ఇచ్చిన్లటందన్నారు. దేశవ్యాప్తం గా ద్వేషం వ్యాప్తి చెందుతోంది. సోదరభావం ప్రమాదంలో వుంది. ధరల పెరుగుదల పచ్చి వాస్తవం. రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం సవాళ్ల మధ్య ప్రజలు నలిగిపోతున్నారు. శరద్‌ యాదవ్‌ నిర్ణయం మాకు మరింత బలాన్నిస్తుంది. సోషలిస్టు శక్తులు చేతులు కలిపితేనే, మతతత్వ శక్తులను తరిమి కొట్టగలుగుతాం. మైనారిటీల ఓటు హక్కును రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. దీన్ని మేము ఒప్పుకోం అని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement