Tuesday, November 26, 2024

River Linking: 36వేల కోట్లతో కెన్-బెట్వా న‌దుల అనుసంధానం..

మధ్యప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌, ఉత్తరప్రదేశ్‌ నీటి అవసరాలను తీర్చడానికి చేప‌ట్ట‌నున్న కెన్‌-బెట్వా నదుల అనుసంధాన ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దేశంలో నదుల అనుసంధానానికి ఈ ప్రాజెక్టు మోడల్‌గా నిలుస్తుందని చెప్పింది. ఈ ప్రాజెక్టు కోసం గ్రాంట్‌ కింద రూ.36,290 కోట్లు, రుణం కింద రూ.3,027 కోట్లు సమకూర్చుతామ‌ని కేంద్రం తెలిపింది.

కాగా, ఈ ప్రాజెక్టును రెండు ద‌శ‌ల్లో చేప‌ట్ట‌నున్నారు. ప్రాజెక్టులో భాగంగా కెన్ న‌దిలోని నీటిని బెట్వా న‌దిలోకి మ‌ళ్లిస్తారు. ఈ రెండు న‌దులు కూడా య‌మునాకు ఉప నదులుగా ఉన్నాయి.. రెండు ద‌శ‌ల్లో ప్రాజెక్టును పూర్తి చేయ‌నున్నారు. తొలి ద‌శ‌లో దౌధాన్ డ్యామ్ కాంప్లెక్స్‌, కెన్‌-బెట్వా లింక్ కెనాల్‌, ప‌వ‌ర్ హౌస్‌ను పూర్తి చేస్తారు. రెండో ద‌శ‌లో దిగు ఓర్ డ్యామ్‌, బినా కాంప్లెక్స్ ప్రాజెక్టు, కొథ బ్యారేజ్ నిర్మిస్తారు.

లింకేజీతో ప్ర‌యోజ‌నం ఏముందంటే..

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల్లో విస్త‌రించిన క‌రువు ప్రాంతం బుందేల్‌ఖండ్‌కు ఈ ప్రాజెక్టు జీవం పోయ‌నుంది. దాదాపు 62ల‌క్ష‌ల మందికి తాగు నీరు అంద‌నుంది. అలాగే 103 మెగావాట్ల జ‌ల విద్యుత్‌, 27 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్ప‌త్తి చేసే అవ‌కాశాలున్నాయి. నేష‌న‌ల్ రివ‌ర్ లింకింగ్ ప్రాజెక్టునే నేష‌న‌ల్ ప‌ర్‌స్పెక్టివ్ ప్లాన్ అంటారు. దేశంలోని న‌దుల‌ను రిజ‌ర్వాయ‌ర్ల ద్వారా క‌లిపే ప్రాజెక్టు ఇది. దేశంలోని ఎక్కువ నీరుండే న‌దుల నుంచి (వ‌ర‌ద‌లు వ‌చ్చే ప్రాంతాలు) త‌క్కువ నీరుండే న‌దుల‌కు (క‌రువు ప్రాంతాలు) నీటిని మ‌ళ్లించ‌డం ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. 1980ల్లోనే ఈ ప్రాజెక్టును చేప‌ట్టాల‌ని అనుకున్నారు. కేంద్ర జ‌ల‌శ‌క్తి నేతృత్వంలోని నేష‌న‌ల్ వాట‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఏజెన్సీ ఈ ప్రాజెక్టును నిర్వ‌హిస్తోంది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం   ఫేస్‌బుక్‌,  ట్విట్టర్   పేజీల‌ను ఫాలో అవ్వండి..

www.prabhanews.com

Advertisement

తాజా వార్తలు

Advertisement