Friday, November 22, 2024

బ్రేకింగ్ న్యూస్..భార‌త్ బ‌యోటెక్ రూపొందించిన‌.. కొవాగ్జిన్ కి డ‌బ్ల్యూ హెచ్ ఓ గుర్తింపు..

కొవాగ్జిన్ అత్య‌వ‌స‌న వినియోగానికి అనుమ‌తించింది డ‌బ్ల్యూ హెచ్ ఓ టెక్నిక‌ల్ అడ్వైజ‌రీ క‌మిటి. భార‌త్ బ‌యోటెక్ రూపొందించిన కొవాగ్జిన్ కు డ‌బ్ల్యూ హెచ్ ఓ గుర్తింపు ల‌భించింది. కొవాగ్జిన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి ఆమోదం కోసం భారత్ బయోటెక్ ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. కొవాగ్జిన్ టీకాను అత్యవసర జాబితాలో చేర్చాలని భారత్ బయోటెక్ సంస్థ ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రపంచ ఆరోగ్య సంస్థకు దరఖాస్తు చేసుకుంది. .. ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్ కోసం ఈవోఐ(ఎక్ప్‌ప్రెస్ ఆఫ్ ఇంట్రెస్ట్) సమర్పించింది. ఈ క్రమంలోనే జూలై 6న వ్యాక్సిన్ డేటా రోలింగ్ ప్రక్రియను ప్రారంభించినట్టుగా డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది.

అత్యవసర వినియోగ జాబితాలో చేర్చేందుకు అవసరమైన సమాచారాన్ని డబ్ల్యూహెచ్‌వో కు ఇప్పటికే సమర్పించామని భారత్ బయోటెక్ వర్గాలు వెల్లడించాయి. అయితే కొవాగ్జిన్ కు సంబంధించి అదనపు సమాచారం కావాలని డబ్ల్యూహెచ్ఓకు చెందిన సాంకేతిక సలహా సంఘం మంగళవారం భారత్ బయోటెక్‌ను కోరింది. కొవాగ్జిన్ కు అనుమతుల జారీ ప్రక్రియ తుది అంకంలో ఉన్నట్టు డబ్ల్యూహెచ్ఓ వర్గాలు పేర్కొన్నాయి. కొవాగ్జిన్ టీకా యొక్క అత్యవసర వినియోగ జాబితా కోసం తుది “రిస్క్-బెనిఫిట్ అసెస్‌మెంట్” నిర్వహించడానికి డబ్ల్యూహెచ్‌ఓ సాంకేతిక సలహా బృందం నవంబర్ 3వ తేదీన సమావేశం అయింది.ఎట్ట‌కేల‌కు కొవాగ్జిన్ కి డబ్ల్యూహెచ్‌వో గుర్తింపు ల‌భించ‌డం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement