Tuesday, November 26, 2024

Flood: భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం.. ఆందోళ‌న‌లో ముంపు వాసులు

భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరికి వరద ఉధృతి పెరుగుతోంది. ఆదివారం ఉదయం 8 గంటలకు 31.5 అడుగులు ఉన్న నీటిమట్టం క్రమంగా పెరుగుతూ సాయంత్రం 6 గంటల స‌మ‌యానికి 36.1 అడుగులకు చేరింది. సోమవారం ఉదయానికి మొదటి ప్రమాద హెచ్చరిక చేరుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈ ఏడాది జులై నెలలో ఒకసారి, ఆగస్టు నెలలో ఒకసారి గోదావరికి పెద్ద ఎత్తున వరదలు వచ్చాయి. ఇప్పుడు కురుస్తున్న భారీ వ‌ర్షాల‌కు మరోసారి భద్రాచలం వద్ద గోదావరికి వ‌ర‌ద పోటెత్త‌డంతో లోతట్టు కాలనీ వాసులు, ముంపు వాసులు ఆందోళన చెందుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement