Tuesday, November 26, 2024

పెర‌గ‌నున్న గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌లు !

ఐదు రాష్ట్రాల ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత సిలిండ‌ర్ ధ‌ర భారీగా పెర‌గి ఛాన్స్ ఉంద‌ని స‌మాచారం. అంత‌ర్జాతీయ మార్కెట్ లో ముడి చ‌మురు ధ‌ర బ్యారెల్ కు 92డాల‌ర్ల పైకి చేరింది. గ్యాస్ సిలెండర్ ధర లో ఏ మార్పు లేదు. 2021 అక్టోబర్ 6 నుంచి ధర స్థిరంగానే వుంది. మార్చి 10 తర్వాత గ్యాస్ సిలిండర్ ధర రూ.100కు పైగా పెరిగే అవకాశం ఉంది. ఇదే కనుక జరిగితే సామాన్యులపై ఎఫెక్ట్ పడనుంది. 2021 అక్టోబర్ నుంచి 2022 ఫిబ్రవరి 1 వరకు చూస్తే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.170 పైకి చేరింది. అక్టోబర్ 1న ఈ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.1736 వద్ద ఉండేది. ఇక నవంబర్‌ కి వచ్చే సరికి రేటు రూ.2 వేలకు చేరింది. అదే డిసెంబర్‌లో అయితే రూ.2,101కు వెళ్ళింది. ఇక జనవరి, ఫిబ్రవరి నెలల్లో ధర తగ్గింది. ఇప్పుడు ఈ సిలిండర్ ధర రూ.1907 వద్ద వుంది. అదే పది కేజీల సిలెండర్ అయితే రూ. 634కే పొందొచ్చు. ఇది ఇలా ఉంటే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెలా ఒకటో తేదీన ధరలు సవరిస్తూ ఉంటాయి. దీనితో సిలెండర్ ధరలు పెరగొచ్చు, తగ్గచ్చు. గ్లోబల్ మార్కెట్‌లో ముడి చమురు ధరలకు అనుగుణంగా రేట్లు అనేవి ఉంటాయనే సంగ‌తి తెలిసిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement