అంతర్జాతీయ వేదికపై కూచిపూడి ప్రదర్శనతో ఆకట్టుకుంది బ్రిటన్ ప్రధాని రిషీ సునాక్ కుమారై అనౌష్క సునాక్. లండన్ లో జరుగుతున్న అంతర్జాతీయ కూచిపూడి డ్యాన్స్ వేడుకల్లో అనౌష్క పాల్గొన్నారు. నాలుగేళ్ల చిన్నారి నుంచి 85 ఏళ్ల వయసున్న వారు కూడా ఈ డ్యాన్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంగవైకల్యంతో బాధపడుతున్న ఓ యువతి వీల్ చెయిర్ లోనే డ్యాన్స్ చేయడం ఆకట్టుకుంది. యూకే ప్రధాని పదవిని అధిరోహించిన తొలి భారత సంతతి వ్యక్తిగా రిషి సునాక్ చరిత్ర సృష్టించారు. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కూతురు అక్షతా మూర్తిని సునాక్ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. కృష్ణ సునాక్, అనౌష్క సునాక్. తొమ్మిది సంవత్సరాల వయసున్న అనౌష్క కొంతకాలంగా కూచిపూడి నేర్చుకుంటున్నట్లు సమాచారం. తాజాగా లండన్ లో జరిగిన ఈ వేడుకల్లో దాదాపు 100 మంది డ్యాన్సర్లు పాల్గొన్నారు.
లండన్ లో అంతర్జాతీయ కూచిపూడి ప్రదర్శన.. డ్యాన్స్ తో ఆకట్టుకున్న బ్రిటన్ ప్రధాని కుమారై
Advertisement
తాజా వార్తలు
Advertisement