Tuesday, November 26, 2024

UK: బోరిస్​, ఫెన్నీకి అంత సీన్​ లేదు.. బ్రిటన్​ ప్రధానిగా రిషి సునక్​కే చాన్స్ !

బ్రిటన్ మాజీ ఆర్థిక మంత్రి రిషి సునక్ ప్రధాని అయ్యే చాన్సెస్​ ఎక్కువున్నాయి. తన ప్రత్యర్థులు బోరిస్ జాన్సన్, పెన్నీ మోర్డాంట్ సోమవారం 100 మంది ఎంపీల మద్దతును కూడగట్టని పక్షంలో ఆ దేశ తదుపరి ప్రధానమంత్రిగా సునక్​కే అవకాశాలుంటాయి. సునక్‌కు ఇప్పటికే 142 మంది పార్లమెంటు సభ్యుల మద్దతు ఉంది. జులైలో ప్రధాని పదవి నుంచి వైదొలగి, సెప్టెంబర్‌లో పదవీ విరమణ చేసిన బోరిస్ జాన్సన్‌కు ప్రస్తుతం 59 మంది ఎంపీల మద్దతు ఉంది. అట్లనే పెన్నీ మోర్డాంట్‌కి 29 మంది సపోర్ట్​ చేస్తున్నారు.

సోమవారం నాటికి 100 మంది ఎంపీల మద్దతును పొందడంలో జాన్సన్, మోర్డాంట్ విఫలమైతే రిషి సునక్ ప్రధాని అవడం ఖాయమని తెలుస్తోంది. గురువారం ప్రకటించిన నిబంధనల ప్రకారం.. గరిష్టంగా ముగ్గురు టోరీ ఎంపీలు పోటీ చేస్తారు. ఎందుకంటే అభ్యర్థులు బ్యాలెట్ పేపర్‌పైకి రావడానికి 100 మంది ఎంపీల పరిమితిని పార్టీ నిర్ణయించింది. పార్టీలో మొత్తం 357 మంది ఎంపీలున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement