Friday, November 22, 2024

రైఫిల్స్ కాన్వాయ్ పై ఉగ్ర‌దాడి..భార‌త ఆర్మీ క‌ల్న‌ల్ కుటుంబంతో సహా 3గురు జ‌వాన్లు మృతి..

అస్సాం రైఫిల్స్ కాన్వాయ్ ల‌క్ష్యంగా ఉగ్ర‌వాద‌సంస్థ దాడికి పాల్ప‌డింది. ఈ ఉగ్రదాడిలో ఆర్మీ కల్నల్, ఆయన భార్య, కుమారుడు మృతి చెందిన విషయాన్ని మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్.బీరెన్ సింగ్ నిర్ధారించారు. ఉగ్రఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదుల కోసం రాష్ట్ర, పారామిలటరీ బలగాలు గాలిస్తున్నాయని చెప్పారు.మ‌ణిపూర్‌లో ఉగ్రవాదులు మెరుపుదాడికి తెగబడ్డారు. మయన్మార్ సరిహద్దులోని చురాచాంద్‌పూర్ జిల్లా సింఘత్‌లో ఈ దాడి జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో భారత ఆర్మీ కల్నల్, ఆయన భార్య, కుమారుడుతోపాటు మరో ముగ్గురు జవాన్లు అమరులయ్యారు. ఇటీవలి కాలంలో జరిగిన అతిపెద్ద దాడి ఇదేనని అధికారులు వెల్ల‌డించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement