ముంబై: టీమిండియా కోచ్ పదవి కోసం చాలా మంది ఎగబడతారు. అందులోనూ విదేశీ కోచ్‌లు మరింత ఇంట్రస్ట్ చూపిస్తారు. ఈ పోస్ట్ ఖాళీ అయిన ప్రతిసారి బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించగానే పెద్ద ఎత్తున విదేశీ మాజీలు అప్లై చేసుకుంటారు. కానీ, ఈసారి మాత్రం మన బోర్డే ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ దగ్గరకు ఈ ప్రతిపాదనతో వెళ్లిందని, అతడు మాత్రం నిరాకరించాడని టైమ్స్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. కోచ్ పదవి వద్దనడానికి కారణమేంటో మాత్రం చెప్పలేదు.
పాంటింగ్ ప్రస్తుతం ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కు కోచ్‌గా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కోచ్ పదవి కోసం రాహుల్ ద్రవిడ్ దాదాపు ఖాయమయ్యాడు. అయితే అంతకుముందే ఒకసారి ద్రవిడ్‌ను అడిగితే అతడు సున్నితంగా తిరస్కరించాడు. అటు కుంబ్లే కూడా ఆసక్తి చూపలేదు. దీంతో బీసీసీఐ పాంటింగ్‌తోపాటు జయవర్దనెలాంటి విదేశీ ప్లేయర్స్ వైపు చూసింది. కానీ, ఆ ఇద్దరూ నో చెప్పడంతో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో మళ్లీ ద్రవిడ్‌నే ఒప్పించారు. ‘‘ఇప్పుడున్న పరిస్థితుల్లో ద్రవిడే కరెక్ట్ చాయిస్. నిజం చెప్పాలంటే మాకు వేరే అవకాశం లేదు’’ అని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు.