ఆస్తి వున్నా ఐనవాళ్ళు లేకపోవడంతో అనాధ అయింది ఓ మహిళ. ఆమె వయస్సు 63ఏళ్లు..గత ఏడాదే మినతి భర్త మరణించాడు..ఆ తర్వాత ఆరు నెలలకి మినతి కుమారై గుండెపోటుతో మరణించింది. దీంతో ఆమె జీవితం చీకటైపోయింది. అప్పటివరకు తనను పట్టించుకోని బంధువులు కూడా తన ఆస్తి కోసం దగ్గరవ్వడం మొదలుపెట్టారు. తన బంధువులు ఎవరికీ తన ఆస్తిని పంచడం ఇష్టం లేని మినతి తన కూతురిని 25 ఏళ్లు రిక్షాలో స్కూలుకు, కాలేజీకి తీసుకెళ్లిన సామల్‌ను పిలిపించింది. తన పేరు మీద ఉన్న ఆస్తులన్నీ సామల్ పేరు మీద రాసేసింది. మినతి పట్నాయక్ చేసిన పనికి దేశమంతా ఆశ్చర్యపోతోంది. తన కోటి రూపాయల విలువైన ఆస్తిని తనకు ఏ సంబంధం లేని ఓ రిక్షావాడికి రాసిచ్చేసింది. తాను చేసిన పనిని విన్నవారు ఆశ్చర్యపోవడంతో పాటు తన గొప్ప మనసుని ప్రశంసిస్తున్నారు కూడా. ఈ సంఘటన ఒడిశాలో చోటు చేసుకుంది.
లోకల్ టు గ్లోబల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily