పెద్దపల్లి జిల్లాలో భారీ సీఎంఆర్(కష్టం మిల్లింగ్ రైస్) కుంభకోణం బయటపడింది. పౌరసరఫరాల శాఖ సీఎంఆర్ కింద రైసుమిల్లు కు ఇచ్చిన వడ్లను బియ్యంగా మార్చి FCIకి లెవీ పెట్టాల్సిన మిల్లర్ బహిరంగ మార్కెట్లో అమ్ముకున్న వైనం బహిర్గతమైంది. లెవీ బియ్యంపై ఫిర్యాదులు రావడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టగా సీఎంఆర్ ధాన్యం మాయమైనట్లు అధికారులు గుర్తించారు. పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్ మండలం పూసాల గ్రామంలోని లక్ష్మీనరసింహ ఇండస్ట్రీ కు పౌరసరఫరాల శాఖ 91,258 క్వింటాళ్ల ధాన్యాన్ని కేటాయించగా 5,95,98,278 రూపాయల విలువ గల 21,100 కుంటాల బియ్యం మాయం చేసినట్లు గుర్తించారు. ఎఫ్ సి ఐ కి లెవీ పెట్టాల్సిన బియ్యాన్ని సదరు మిల్లర్ బహిరంగ మార్కెట్లో అమ్ముకున్నట్లు గుర్తించారు. పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు పెద్దపల్లి జిల్లాలోని రైస్ మిల్లుల్లో తనిఖీలు నిర్వహిస్తే పెద్దఎత్తున కుంభకోణాలు బహిర్గతం అయ్యే అవకాశాలున్నాయి. జిల్లాలోని మిల్లర్లు లెవీ బియ్యం బహిరంగ మార్కెట్లో అమ్ముకున్నట్లు సమాచారం. కోట్లాది రూపాయల విలువచేసే బియ్యం పక్కదారి పట్టి నట్లు తెలిసింది. కష్టం మిల్లింగ్ రైస్ వ్యవహారంలో మిల్లర్లకు అధికారులు సహకరించినట్లు సమాచారం. లోతుగా విచారిస్తే మరిన్ని ఆసక్తికర విషయాలు బహిర్గతమయ్యే అవకాశాలున్నాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement