Friday, November 22, 2024

మార్స్ గ్ర‌హంపై వ‌రి పంట‌.. ప‌రిశోధ‌న‌లు చేస్తోన్న యూనివ‌ర్సిటీ ఆఫ్ అర్కాన్స‌స్

మార్స్ గ్ర‌హంపై వ‌రి పంట‌ని పండించేందుకు ఉన్న అవ‌కాశాల‌పై ప‌రిశోధ‌న‌లు చేస్తున్నారు యూనివ‌ర్సిటీ ఆఫ్ అర్కాన్స‌స్.ఈ పరిశోధనకు అభిలాశ్ రామచంద్రన్ నాయకత్వం వహించారు.ఈ ప్రయోగం కోసం అమెరికాలోని మొజావే ఎడారికి చెందిన శిలల పొడితో అచ్చం మార్స్ మీద ఉండే మట్టిని తయారు చేశారు. ఈ మట్టిని మొక్కలు పెరిగేందుకు అవసరమైన మిశ్రమాలతో కలిపి కుండీల్లో నింపారు. ఈ కుండీల్లో వడ్లను చల్లి రోజుకు రెండుసార్లు నీళ్లు పోశారు. ఆశ్చర్యకరంగా అన్ని కుండీల్లో వరి గింజలు మొలకెత్తాయి. అయితే కిలో మట్టిలో 3గ్రాముల కన్నా ఎక్కువ పర్‌క్లోరేట్‌ కెమికల్‌ ఉంటే వడ్లు మొలకెత్తలేదు. దీంతో పర్‌క్లోరేట్‌ను తట్టుకునేలా జన్యుపరంగా మార్చిన అడవి వంగడాన్ని పరీక్షించారు. ఒక గ్రాము వరకు పర్‌క్లోరేట్ ఉన్న మట్టిలో వడ్లు మొలకెత్తాయి. ఈ పరిశోధన ఫలితాలు అంగారకుడి మీదకు చేపట్టనున్న ప్రయోగాలకు సహాయపడనున్నాయి.

భూమిపై కాకుండా ఇతర గ్రహాలపై జీవం ఉనికికి సంబంధించి గత కొన్నేళ్లుగా పరిశోధనలు జరగుతున్నాయి. ఈ నేపథ్యంలో మార్స్ గ్రహంపై జీవం ఉనికి ఆధారాలు లభించాయి. దీంతో అంగారకుడి మీదికి మనుషులను పంపించేందుకు ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఎలన్ మస్క్ లాంటి వారు సైతం ఇందుకోసం పరిశోధనలు చేస్తున్నారు. అంతేకాకుండా అక్కడ మనుషులతో కూడిన కాలనీలు ఏర్పాటు చేయాలనేది తన లక్ష్యమని మస్క్ తెలిపారు. మనుషులను పంపించడం వరకు ఓకే.. కానీ అక్కడికి వెళ్లిన వారి ఆహారం లాంటి అవసరాల సంగంతేంటి..అంగారకుడి మీదకు వెళ్లే వారి అవసరాల కోసం కావాల్సిన వస్తువులను భూమి మీద నుంచి తీసుకెళ్లడం కుదరదు. కాబట్టి శాస్త్రవేత్తలు అంగారకుడి మీదనే పంటలు పండించేందుకు ఉన్న అవకాశాలపై పరిశోధనలు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement