ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను హేళన చేస్తూ ..చేయాల్సింది జన్మదిన వేడుకలు కాదు.. తద్దినం పెట్టాలి అంటూ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యాలపై రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మండిపడ్డారు.ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినోత్సవ వేడుకలలో భాగంగా నకేరేకల్ నియోజకవర్గ కేంద్రంలో స్థానిక శాసన సభ్యులు చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డికి అంతకు మించిన సంస్కారం ఉంటుందని భావించడం లేదు..సంస్కారా హీనులు మాత్రమే అలా మాట్లాడుతారు..రాహుల్ గాంధీ పై బిజెపి ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల్ని రాజకీయలకతీతంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఖండించారు.అటువంటి ముఖ్యమంత్రి హేమంత్ బిస్వాస్ కంటే రేవంత్ మరింత సంస్కారా హీనుడు..నాయకుడి పుట్టిన రోజును ప్రజలు జరుపుకుంటున్న శుభసందర్భంలో తద్దినాలు అంటూ మాట్లాడిన సంస్కారం రేవంత్ రెడ్డిది..కాంగ్రెస్ కు తద్దినం పెట్టేందుకే మా పార్టీలో చేరారని కాంగ్రెస్ సీనియర్ నేతలు చెబుతున్నారు..ఉద్యమం లో కుట్రలు చేసినోళ్ళకు,వచ్చిన తెలంగాణను బలహీన పరిచేందుకు మూటలు మోసిన చరిత్ర రేవంత్ ది..రేవంత్ కాంగ్రెస్ పార్టీ నేత కాదు టిడిపి కోవర్ట్ ..కోవర్ట్ సేటోళ్లకు,తద్దినం పెట్టెటోళ్లకు ప్రతి రోజు అవే గుర్తుకు వస్తాయన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..