సిద్దిపేట : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ భారత రాజ్యాంగాన్ని అవమానపరిచారని గజ్వేల్ పోలీస్ స్టేషన్ లో కేసీఆర్, నమస్తే తెలంగాణ, టీ న్యూస్ పై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు నర్సారెడ్డి లు పిర్యాదు చేశారు. ఈసందర్భంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… అంతర్జాతీయ దేశ ద్రోహుల కంటే ప్రమాద కరమైన వ్యక్తి కేసీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై, నమస్తే తెలంగాణ, టి న్యూస్ యాజమాన్యాలపై రాజ ద్రోహం కేసు నమోదు చేయాలన్నారు. కేసీఆర్ మీద, యాజమాన్యాల మీద కఠినమైన చర్యలు తీసుకోపోతే న్యాయస్థానాల తలుపు తడుతామన్నారు.
కేసీఆర్ పై కేసు నమోదు చేసి శిక్షించేంత వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. కేసీఆర్ బయటకు వచ్చి బహిరంగంగా భారత రాజ్యాంగానికి, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. రాజ్యాంగం వల్ల ప్రయోజనం లేదని కేసీఆర్ మట్లాడిండు.. ఇది దేశ ద్రోహ చర్య అన్నారు. దేశ ద్రోహం కేసు పెట్టి తక్షణమే అరెస్ట్ చేయాలన్నారు. ఎనిమిది సంవత్సరాల కాలంలో బీజేపీకి సంపూర్ణ సహకారం అందించిన కేసీఆర్ ఇప్పుడు తిట్టడం అంటే చీకటి ఒప్పందాల్లో తేడా రావడమే అన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..