Thursday, November 21, 2024

Success Story: విద్యుత్తు రంగంలో విప్లవాత్మక మార్పులు.. చీకట్లను చీల్చుకుని వెలుగుల్లోకి తెలంగాణ‌

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం పరిస్థితి అంధకారంగా ఉండేది. అప్పుడు కరెంటు పోతే వార్త కాదు.. కరెంట్‌ ఉంటే వార్త అనే పరిస్థితి ఉండేది. కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకునే పరిస్థితి. కరెంట్‌ కోతలు. పవర్‌ హాలీ డేలు. పరిశ్రమలకు ఏనాడూ సరి పడా కరెంటు ఇచ్చిన పాపాన పోలేదు. నాణ్యతలేని కరెంటుతో ఇంట్లో ఫ్యాన్లు, ఫ్రిజ్‌లు, టీవీలు కాలిపోయేది. రైతాంగానికి పేరుకే 9 గంటల కరెంటు… అరకొరగా వచ్చే కరెంటు.. తక్కువలు ఎక్కువలతో…ట్రాన్స్‌ఫార్మార్లు, మోటార్లు కాలిపోయేది. రాష్ట్ర విభజన తర్వాత సీఎం కేసీఆర్‌ సీఎం కేసీఆర్‌ విద్యుత్‌ రంగంపై దృష్టి పెట్టారు. అతి తక్కువ కాలంలో అనుకున్నది సాధించారు. తెలంగాణలో విద్యుత్‌ వెలుగులు విరజిమ్మారు.

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఒకవైపు రాష్ట్రంలో అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకొంటూనే, అవసరమైన మేర కొనుగోలు చేస్తూ, ఇవ్వాళ కరెంటు మిగులు రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దారు. ఎలాంటి విద్యుత్‌ కోతలు లేకుండా, పవర్‌ హాలీడేలకు స్వస్తి పలికి, నాణ్యమైన కరెంటును 24 గంటల పాటు నిరంతరాయంగా అందిస్తున్నారు. ఇవ్వాళ దేశంలో 24 గంటల కరెంటు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. అన్నిరంగాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ సరఫరాతో వెలుగు జిలుగుల రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. అంతులేని కరెంటు కోతలు, పవర్‌ హాలిడేల నుండి ఆనతి కాలంలోనే తెలంగాణ శాశ్వత విముక్తిని సాధించింది. తలసరి విద్యుత్తు వినియోగంలో తెలంగాణ దేశంలోనే నంబర్‌-1 గా నిలిచింది.

పెరిగిన విద్యుత్‌ స్థాపిత సామర్థ్యం..
2014 జూన్‌ 2 నాటికి రాష్ట్రంలో స్థాపిత విద్యుత్తు సామర్థ్యం 7,778 మెగావాట్లు కాగా, 2022 ఏప్రిల్‌ 1 నాటికి 17,305 మెగావాట్లకు పెరిగింది. సోలార్‌ విద్యుదుత్పత్తి కూడా 74 మెగావాట్ల నుండి 4,431 వేల మెగావాట్లకు పెరిగింది. విద్యుత్‌ గరిష్ట డిమాండ్‌ రాష్ట్ర విభజన నాటికి 5,661 మెగావాట్ల ఉండగా ఇప్పుడు 14,160 మెగావాట్లకు చేరింది. గ్రిడ్‌ విద్యుత్‌ వినియోగం 128 మెగా యూనిట్ల నుండి 283.83 మెగా యూనిట్లకు పెరిగింది.

ట్రాన్స్‌కో, డిస్కంలలో పెరిగిన సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్స్‌ సంఖ్య..
ఉమ్మడి రాష్ట్రంలో 400 కేవీ సబ్‌ స్టేషన్‌లు 6 మాత్రమే ఉండగా.. ఇప్పుడు వాటి సంఖ్య 23కి పెరిగింది. 220 కేవీ సబ్‌ స్టేషన్‌లు 51 మాత్రమే ఉంటే వాటిని 98 కి పెంచుకున్నాం. 132 కేవీ సబ్‌ స్టేషన్‌లు 176 ఉండగా..ఇప్పుడు 247 పెరిగాయి. ఇ##హచ్‌టి సబ్‌ స్టేషన్‌లు 233లకు గాను వాటిని 368కి పెంచుకోవడం జరిగింది. మొత్తం ఇ##హచ్‌టి పొడవు 16,379 మాత్రమే ఉంటే, వాటిని 27,375కి పెరిగింది. ట్రాన్స్‌ ఫార్మర్ల సామర్థ్యం కూడా 14,973 మెగావాట్లు నుంచి 38,426కి పెంచుకోవడం జరిగింది. డిస్కంలలోనూ 33 కెెవీ సబ్‌ స్టేషన్ల సంఖ్యను 2,138 నుంచి 3,159కు, 33కేవీ, 11కేవీ ఎల్‌ టీ ల పొడవును 4.89 లక్షల నుంచి 6.58 లక్షలకు పెంచుకున్నది. వ్యవసాయ సర్వీసులు 19.03 లక్షల నుండి 26.45 లక్షలకు పెరిగాయి. రాష్ట్రంలో మొత్తం సర్వీసులు 1.11 కోట్ల నుండి 1.71 కోట్లకు పెరిగాయి. 17 వేల మెగావాట్ల గరిష్ట డిమాండ్‌ వచ్చినా తట్టుకునే విధంగా విద్యుత్‌ పంపిణీ, సరఫరా వ్యవస్థలను ప్రభుత్వం బలోపేతం చేసింది.

రాష్ట్రం ఏర్పాటయ్యాక పవర్‌ప్లాంట్ల నిర్మాణం..
కొత్తగూడెం జిల్లలో భద్రాద్రి థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయింది. నల్లగొండ జిల్లాలో యాదాద్రి ఆల్ట్రా మెగా ప్రాజెక్టు నిర్మాణమవుతున్నది. విభజన సమయంలో పోలవరం ప్రాజెక్టులో మన వాటా మనకు దక్కుండా గండి కొట్టి, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రాలో కలిపారు. దీంతో పాటు మనకు దక్కాల్సిన విద్యుత్‌ వాటాను కూడా కోల్పోయాం. అయినప్పటికి ఆంధ్రప్రదేశ్‌ కు దీటుగా, మొత్తం దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో 24 గంటల విద్యుత్‌ను అందిస్తున్నాం. విద్యుత్‌ రంగంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచింది.

- Advertisement -

వ్యవసాయానికి పూర్తిగా ఉచితంగా విద్యుత్‌ సరఫరా..
దేశంలో వ్యవసాయానికి 24 గంటలపాటు నిరంతరాయంగా నాణ్యమైన ఉచిత విద్యుత్తును సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.40 శాతం విద్యుత్‌ను వ్యవసాయరంగానికే సరఫరా అవుతున్నది. రాష్ట్ర విభజన తర్వాత రూ.3,196 కోట్ల వ్యయంతో 6.39 లక్షల వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లను కొత్తగా ప్రభుత్వం కల్పించింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యుత్‌ కనెక్షన్ల సంఖ్య 25.63 లక్షలకు పెరిగింది. 2014- 15 సంవత్సరం నుండి ఇప్పటివరకు వ్యవసాయానికి ఉచిత విద్యుత్తును సరఫరా చేయడం కోసం ప్రభుత్వం రూ.39 వేల 200 కోట్లను సబ్సిడీగా అందజేసింది. చేనేతలను ఆదుకునేందుకు 2014-15 నుంచి రాష్ట్రంలో 5 హెచ్‌ పీ లోడ్‌ తో నడుస్తున్న పవర్‌ లూమ్‌ యూనిట్లకు 50 శాతం విద్యుత్తు రాయితీని తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నది. రాష్ట్రం ఏర్పడ్డనాటి నుంచి ఇప్పటి వరకు రూ.34.50 కోట్లను 10,000 పవర్‌ యూనిట్లకుగాను విడుదల చేసింది.

దోబీ ఘాట్లకు, లాండ్రీలకు, నాయీ బ్రాహ్మణుల సెలూన్లకు..
ప్రభుత్వం రజకుల దోబీ ఘాట్లకు, లాండ్రీలకు, నాయీ బ్రా#హ్మణుల సెలూన్లకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు సౌకర్యం కల్పించింది. పౌల్ట్రిd, టెక్స్‌టైల్‌ రంగాల వారికి రూ.2 సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తున్నది. వ్యవసాయ, ఇతర అన్నిరంగాలకు కలిపి క్రాస్‌ సబ్సిడీ, సబ్సిడీగా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ సంస్థలకు ఈ ఆర్థిక సంవత్సరం రూ.13,100 కోట్లు చెల్లిస్తున్నది. చేనేత రంగానికి 50 శాతం సబ్సీడిని అందిస్తున్నది. విద్యుత్‌ శాఖలో పని చేస్తున్న అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు 23,667 మంది సర్వీసులను క్రమబద్ధీకరణ చేసింది.

ఒకే ఒక్కసారి విద్యుత్‌ చార్జీల పెంపు..
ఈ పరిస్థితుల్లో విద్యుత్‌ సంస్థలు 2022- 23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 18 శాతం చార్జీల పెంపుదలకు రాష్ట్ర విద్యుత్‌ రెగ్యులేటరీ కమిషన్‌ సిఫారసు చేసింది. రాబోయే ఏడాదిలో 74,727 మిలియన్‌ యూనిట్ల కొనుగోలు, రూ.53,054 కోట్ల రెవెన్యూ అవసరాలను అంచనా వేశాయి. కమిషన్‌ రూ.48,708 కోట్ల అవసరాలకు అనుమతినిస్తూ రూ.6,831 కోట్ల చార్జీల పెంపుదల ప్రతిపాదనలకు గాను రూ.5,596 కోట్ల పెంపుదలకు అనుమతినిచ్చింది. విద్యుత్‌ చార్జీలను ప్రధానంగా ఉత్పత్తి వ్యయం, సరఫరా, పంపిణీ వ్యయాలు ప్రభావితం చేస్తాయి. 2014- 2015లో టన్ను బొగ్గుకు రూ.50గా ఉన్న క్లీన్‌ ఎనర్జీ సెస్‌ ప్రస్తుతం రూ.400లకు పెరిగింది. అదేవిధంగా గత ఐదారేండ్లలో రెట్టింపైన చమురు, గ్యాస్‌ ధరల వల్ల బొగ్గు రవాణా, రైల్వే రవాణా చార్జీలు కూడా పెరిగాయి. మొత్తంగా విద్యుత్‌ ఉత్పత్తి వ్యయం భారీగా పెరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement