డీఎస్ ఎస్ భవన్ లో మంత్రులు మహమ్మద్ ఆలీ, తలసాని శ్రీనివాస్,కొప్పుల ఈశ్వర్ వచ్చే నెల 3న ప్రారంభమయ్యే రంజాన్ పండుగపై సమీక్ష చేపట్టారు. ఈ సమీక్షా సమావేశానికి హైదరాబాద్ నగరానికి చెందిన టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల ఎమ్మెల్యేలు, మైనార్టీ శాఖ అధికారులు, సీపీ సీవీ ఆనంద్‌తో పాటు పలువురు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ముస్లీం సోదరులు ఎంతో పవిత్రంగా భావించే రంజాన్ పండుగకు ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ప్రతి సంవత్సరం రంజాన్ పర్వదినాన్ని ఘనంగా జరుపుకునేలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తూ వస్తున్నామని పేర్కొన్నారు. పేదలు సైతం పండుగను సంతోషంగా జరుపుకోవాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన మేరకు నూతన దుస్తుల గిఫ్ట్ ప్యాక్‌లను పంపిణీ చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గుర్తు చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..