Wednesday, November 20, 2024

పగబట్టిన కోడెనాగు.. ఒకే వ్యక్తిని ఏడు సార్లు కాటేసింది!

ఏదైనా పామును చంపబోతే ఆ పాము పగబట్టి కాటేస్తుందని అనేక సినిమాల్లో చూసే ఉంటారు. కానీ, నిజ జీవితంలో ఓ వ్యక్తిపై పగ పెట్టుకున్న నాగుపాము.. అతడిని ఏడు సార్లు కాటు వేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ జిల్లాలో జరిగింది. అసలు పాము పగబట్టడం ఏంటి? అది కూడా 7 సార్లు కాటేయడం ఏంటని అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చదివేయండి.

ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ జిల్లాకు చెందిన థానా స్వర్ గ్రామంలో ఎహ్సాన్ అలీ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. అతడు గతంలో అనుకోకుండా ఓ పామును చంపాడు. ఆ పాముకు చెందిన మరో జంట పాము.. తనపై 7 సార్లు దాడి చేసి కాటేసిందని చెబుతున్నాడు. ఇలాంటి సంచలన వార్తతో ఎహ్సాన్ అలీ ఇప్పుడు వార్తల్లో నిలిచాడు. పాము కాటు వేసిన ప్రతిసారీ తన కుటుంబ సభ్యులు చికిత్స కోసం తనను హాస్పిట‌ల్‌కు తీసుకెళ్తున్నారని ఎహ్సాన్ అలీ చెప్పాడు.

పాము కాటువేసిన ప్రతిసారీ తాను మృత్యువు నుంచి తప్పించుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు. అలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు సార్లు అదే పాము తనను కాటు వేసిందని గుర్తించాడు. ఈ క్రమంలో తాను పూర్తి భయాందోళనతో జీవితాన్ని గడుపుతున్నట్లు ఆ వ్యక్తి తెలిపాడు. పాము భయంతో తాను కూలీ పనికి కూడా వెళ్లడం మానేసినట్లు ఆవేదన వ్యక్తిం చేశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement