Saturday, November 23, 2024

TS | రేవంత్​రెడ్డి రైతు వ్య‌తిరేక వ్యాఖ్య‌లు.. ఎమ్మెల్సీ శంబీపూర్ వాల్ పెయింటింగ్స్!

కుత్బుల్లాపూర్, (ప్రభ న్యూస్): టీపీసీసీ అధ్యక్షుడు అమెరికా వేదికగా విద్యుత్ సరఫరాపై నోరూపారేసుకోగా తెలంగాణ అంతటా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. రేవంత్ దిష్టిబొమ్మ దహనం నుండి రైతు వేదికల వద్ద బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే ల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు సాగుతున్నాయి. ఇదిలా ఉంటె ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు వినూత్న రీతిలో ఆలోచించి వాల్ పెయింటింగ్స్ తో రైతులను ఆలోచింప చేసేలా. కొటేషన్స్ తో మేల్కొలిపే ప్రయత్నం చేస్తున్నారు.

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో వాల్ పెయింటింగ్స్ తో మేలుకో రైతన్న.. మేలుకో.. కటిక చీకట్ల కాంగ్రెస్ కావాలా.. కరెంట్ వెలుగుల బీఆర్ ఎస్ కావాలా? అంటూ గోడలపై చేతి రాతల పెయింటింగ్స్ వేయించారు. అంతేకాక ఆయా ప్రాంతాల్లో పెద్ద పెద్ద వాల్ పోస్టర్లు వేయించారు. కటిక చీకట్ల కాంగ్రెస్ ను తరిమికొడుదాం.. 24 గంటల ఉచిత విద్యుత్ ను అందిస్తున్న సీఎం కేసీఆర్ కు వెన్నంటి ఉందామ‌ని రైతులను మేల్కొలుపుతున్నారు.

వారెవ్వా. ఏం చేస్తుండ్రు సారు..
కుత్బుల్లాపూర్ నియోజకవర్గమే కాక మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో వాల్ పెయింటింగ్స్, వాల్ పోస్టర్లతో కాంగ్రెస్ తీరును ఎండగడుతూనే రైతాంగాన్ని మేల్కొల్పుతున్న తీరు ఇప్పుడు స్థానికంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. రేవంత్ చేసిన వ్యాఖ్యలను ప్రచార అస్త్రాలుగా మార్చుకున్నారు విప్, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు. సూటిగా.. సుత్తిలేకుండా ఆలోచింపజేసేలా వాల్ పెయింటింగ్స్, వాల్ పోస్టర్లతో మేల్కొలిపెందుకు చేస్తున్న ప్రయత్నాన్ని బీఆర్ ఎస్ శ్రేణులు, అన్ని వర్గాల ప్ర‌జ‌లు ఎమ్మెల్సీ
శంబీపూర్ రాజును వారెవ్వా ఏమి చేస్తుండ్రు సారు.. నిరసనలే కాదు శాంతియుతంగా ఎవరిని డిస్టర్బ్ చేయకుండా.. ఆలోచింపచేసే కొటేషన్స్.. మీ ఆలోచన అద్భుతం అంటూ పొగుడుతున్నారు. గతంలో పార్టీలు గోడలపై ప్రచారం చేసుకునేవని.. మళ్లీ ఎనుకటి లెక్క గోడలపై వాల్ పెయిటింగ్స్ తో రాసిన ఉత్తేజిత అక్షరమాల కచ్చితంగా రైతాంగాన్ని కట్టిపేడేస్తుందని.. బీఆర్ఎస్ పార్టీకి మంచి మైలేజ్ ఇచ్చే ఆలోచన అని తెలంగాణ అంతటా చేస్తే రైతులు గట్టిగా ఒన్ చేసుకుంటారని చర్చించుకుంటున్నారు.

ఉమ్మడి పాలనలో ఎట్లుండే తెలంగాణ? : విప్, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు
నాడు సమైక్య రాష్ట్రంలో సీమాంధ్ర పాలనలో తెలంగాణ రైతుల‌ పరిస్థితి ఎట్లుండే.. పవర్ హాలిడేస్ తో పరిశ్రమలు దివాలు తీసిన రోజులను మనం కళ్లారా చూశాం. వచ్చి పోయే కరెంటు.. లో ఓల్టేజితో సరఫరా కారణంగా రైతుల మోటార్లు కాలిపోతే రిపేర్లు చేయించుకోలేక రైతు గుండె చెరువు అయ్యేది. నాడు పంట వేసిన రైతన్న కరెంట్ ఎప్పుడోత్తదా అంటూ కల్లుకాయలు కాసినట్లు ఎదురుజుత్తున్డే.. నేడు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రైతన్న గుండె మీద చేయేసుకొని కంటి నిండా నిద్రిస్తూ కేసీఆర్ సారు సీఎంగా ఉండు.. మాకేం దిగులు.. ఎక్కడుంటడో మనసున్న మరాజు.. ఎక్కడున్నా సల్లంగా ఉండాలి.. గిసొంటోడి పాలనలో తెలంగాణ పచ్చగా ఉంటదని రాష్ట్రమంతా రైతులంటుండ్రు..

ఇది చూసి ఓర్వలేని రేవంత్ నోరూపారేసుకుండు. తెలంగాణ ప్రభుత్వం ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి రైతన్న సల్లంగ ఉండాలనే తలంపుతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని 24 గంటల పాటు రెప్పపాటు పోని నాణ్యమైన కరెంటు రైతుకు అందిస్తుంది. ఫలితంగానే తెలంగాణ వచ్చాక బి ఆర్ ఎస్ పాలనలో గతంలో కంటే రెట్టింపైన పంట దిగుబడి జరుగుతుందని లెక్కలు చెబుతున్నాయి. రేవంత్ ది, కాంగ్రెస్ ది ధింపుడుగల్ల రాజకీయమే తప్ప ఇంకేమిలేదు. బీఆర్ ఎస్ ప్రభుత్వాన్ని రైతులు ఆశీర్వదిస్తూ ఆదరిస్తుంటే ఓర్వలేని తనంతో చేసిన వ్యాఖ్య‌లే. కాంగ్రెస్ వచ్చేది లేదు సచ్చేది లేదు. వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ నేతృత్వంలో తిరుగులేని మెజార్టీ తో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వస్తాం.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement