తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా ఎంపీ రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. వేద పండితుల ఆశీర్వచనాల మధ్య ఉత్తమ్ కుమార్ రెడ్డి నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహాల ఇన్ ఛార్జ్ మాణికం ఠాగూర్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్సింహ, జానారెడ్డి, వంశీచంద్, ప్రచార కమిటి చైర్మన్ మధుయాష్కీ, వర్కింగ్ ప్రెసిడెంట్లు గీతారెడ్డి, అజారుద్దీన్, జగ్గారెడ్డి, మహేష్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్ సహా పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. పార్టీ నాయకులు రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇది కూడా చదవండి: రేవంత్ ఇప్పుడే సీఎం అయిపోయారా?